నీకు తెలిసిన చుట్టరికమే...కాని ఒప్పుకోవు...!!
మమకారం మాటలు కరువై మూగబోయింది...!!
నువ్వు అలిగి నాతొ మాటాడనట్లే.!!
వేదన వర్షమై కన్నీరు ధారలా జారుతోంది...!!
నువ్వు కూడా జారిపోతున్నావు దొరకుండా...!!
నా అనుకున్న బంధమే నాది కానంటోంది...!!
నువ్వు నన్ను కాదనుకున్నట్లే.!!
జ్ఞాపకాల్లో బతికేద్దామంటే...
బతుకే జ్ఞాపకంలా అయిపొయింది...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి