24, డిసెంబర్ 2012, సోమవారం

చంద్రునిలో మచ్చలా...!!

మనసెరిగిన మనసుతో ఆహ్లాదం
పంచుకునే పలుకులు
పెంచుకునే అనుబంధానికి ప్రతీకలు....!!
పగిలిన హృదయం నుంచి 
విరిగిన ముక్కలు ఏరుకుంటుంటే...
లెక్కలేనన్ని ముక్కల చుక్కల్లో...
కన్నీటి జ్ఞాపకాలు ఎన్నెన్నో....!!
అతుకులేసిన ఎదలో....
వెతల చారలు అలానే ఉండిపోయాయి...
నిరీక్షణలో నీరసించిన...
చంద్రునిలో మచ్చలా...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శోభ చెప్పారు...

"లెక్కలేనన్ని ముక్కల చుక్కల్లో...
కన్నీటి జ్ఞాపకాలు ఎన్నెన్నో....!!"......... మనసుని మెలిపెట్టేలా ఉంది Manju Yanamadala గారు...

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శోభ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner