4, డిసెంబర్ 2012, మంగళవారం

ఈ మాటని చెప్పారేమో....!!

పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని అందరికి తెలిసిన పెద్దలు చెప్పిన సామెత కదా....!! ఇది నిజం అంటాను నేను....కాదనే వాళ్ళు చేతులెత్తండి...ఎంత మంది నాకు ఓటేస్తారో చూసి...దానిని బట్టి నేను రాజకీయాల్లోకి వెళ్లి... పార్టి పెట్టి కాస్త సొమ్ము సంపాదిన్చుకుందామని ప్లాను....ఎవరికీ చెప్పకండేం...!! మళ్ళి నాకు పోటి ఎక్కువైపోతుంది...!!
సరే మరి...చేతులెత్తితే నాకు కనపడి ఛావదు కదా అందుకే కామెంట్లు పెట్టేయండి.....!!
ఎంత గొప్ప  వైద్యుని వైద్యమైనా ఇంట్లో పనికిరానట్లే..!!
ఎంత గొప్పవారైనా పదిమందికి మంచి చేసినా ఇంట్లో పనికిరానివారే....!!
అందరికి నచ్చినా ఇంట్లోవాళ్ళకి నచ్చని వారే....!!
ఇలాంటివి అన్ని చూసే మన పెద్దలు ఈ మాటని చెప్పారేమో....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

buddhamurali చెప్పారు...

ప్రతి ఒక్కరుఇదే అభిప్రాయం తో ఉంటారు .. కాబట్టి అంతా మిమ్ములను సమర్దిస్తున్నట్టే కదా .. అనుభవం లేని వ్యాపారం లోకి వెళితే దెబ్బ తింటారు అసలే రాజకీయం ఖరీదైన వ్యాపారం

చెప్పాలంటే...... చెప్పారు...

అయితే ఓట్లు అన్నీ నాకే కదా...!! మీరన్నది నిజమే అండి అనుభవం కాదు అబద్దం కూడా కష్టమే....ఖరీదైన వ్యాపారం గురించి ఆలోచించాలి కాక పొతే చిన్నప్పుడు జీతం ఎక్కువ రాష్ట్రపతికే కదా అందుకే ఒక్కసారి అవ్వాలనుకునేదాన్ని....మీ స్పందనకు సంతోషం మురళి గారు :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళీ గారు అన్నది నిజం. బొక్క బోర్లా పడతారు జాగ్రత్త.

అయినా ..ఏమిటబ్బా.. ఇలాంటి యోచన చేస్తూ ఉన్నారు..?

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనీ ఎవరన్నారు.!? .దేశ చరిత్ర మారును. ముమ్మాటికి. నిజం.

అజ్ఞాత చెప్పారు...

మీ 'న్యాయ పీఠాధిపతి' పోస్టులోని బొమ్మలో వున్న, ఎత్తిన రెండుచేతులు నావే... :)

చెప్పాలంటే...... చెప్పారు...

-:) ఏమో అలా అనిపించింది వనజ గారు.....థాంక్యు మీ సలహాకి
అవునా అండి SNKR గారు బొమ్మలు అలా వెదుక్కుంటూ నచ్చినవి తీసి మార్చుకుంటూ వుంటాను నాకు కావాల్సినట్టుగా...ఏమి అనుకోకండి చెప్పకుండా తీసుకుంటున్నానని

చెప్పాలంటే...... చెప్పారు...

SNKR గారు రెండు చేతులూ కనిపించాయండి థాంక్యు అండి అంటే మీవి రెండు ఓట్లు అన్నమాట

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner