జారిపోతున్నానంటోంది జాలిగా చూస్తూ....
ఏమి చేయలేని నిస్సహాయతను చూసి..
పగలబడి నవ్వుతోంది కాలపాశం...
నేనెవరి కోసం ఎదురు చూడను
నా పని నాదే అంటూ...!!
చూస్తూ చూస్తూనే తరిగి పోతోంది
మబ్బుల చాటుగా నింగి లోని జాబిలి
జరుగుతున్న సంఘర్షణ యుద్దానికి
మూగ సాక్షిగా ఉండలేక....!!
మరణ శాసనాన్ని మార్చి రాయడానికి
అపర బ్రహ్మను కానే కాను...!!
విధిరాతను మార్చి రాసే వింత...
జరిగితే.....!! ఎంత బావుండు....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బాగుంది మంజు గారూ!...చిత్రం ముందా?మీ కవిత ముందా?అని సందేహం...నైస్...@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు...-:) ముందు కవిత తరువాతే చిత్రాన్ని వెదికాను
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి