కన్నీటి కడలిలో తేలిపోతోంది
తడిచిన మనసు కాగితాలు
చెమ్మతో చెలిమి చేస్తుంటే
చెరిగి పోతున్న సిరాక్షరాలు
ఒక్కొక్కటిగా మాయమై పోతుంటే
శిలాక్షరాలన్న భ్రమలో నుండి బయట పడి....
నీటి మీది రాతలని నుదుటిపై
రాసిన విధిని నిందించాలో...!!
మళ్ళి కొత్తగా రాసుకోవాలన్న
ప్రయత్నాన్ని ఆరంభించాలో....!!
గతంలో జ్ఞాపకాలు మాత్రమే గుర్తుగా
వాస్తవాన్ని మరచి పోవాలో..!!
గుచ్చుకునే గురుతుల గునపాల్ని
గుండెల్లో దించుకోవాలో....!!
అంధకారంలోకి ఆశగా
కనపడని వెలుగు కోసం
ఎదురు చూడటం...!!
అర్ధం లేని వ్యర్ధమైన నిరీక్షణ...!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
పదునైన అక్షర కావ్యం నీవు రాసింది. చక్కటి ఆసయాల ఊడలూ, ఆచరణ శాఖలూ ఉన్న మహా వృక్షం మీ కావ్యం. బాగుందమ్మా.
ధన్యవాదాలు అక్క మీకు
Heart touching....
Thank u so much Anu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి