22, సెప్టెంబర్ 2013, ఆదివారం

నిశ్చల సమాధిలో నిరవధికంగా....!!

వేదనలో మనసు శోధనలో
మనిషి అంతరంగ ఆవిష్కరణ...!!
కలగలిసిన భావ పరంపరకు
ఆకృతినివ్వలేని అసహాయత...!!

కోపమో ఆవేశమో అర్ధం చేసుకోలేని
మనసు లోని మరో మనిషి...!!
మారుతున్న విలువల వలువల
వ్యాపారంలో ఇమడలేక నిస్సహాయత....!!

తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుల పరిహాసం
పై పై పూసుకున్న అలంకారాల ఆహార్యం...!!
అక్కర్లేని ఆత్మాభిమాన అందం
అంతు చిక్కని అంతః సౌందర్యం...!!

ధనానికి దాసోహం చేస్తూ తలను వంచి
వెల వెల పోతూ వలసలు వెళిపోతూ....
పరదా మాటున మేలి ముసుగులో మోసపోతూ
దాస్య శృంఖలాలను తెంచుకోలేక....!!

బంధాలకు బందీగా చిక్కుకుని
భాద్యతలకు బానిసగా మారి....
కష్టమైన ప్రేమను ఇష్టంగా ఇష్టపడుతూ
నిశ్చల సమాధిలో నిరవధికంగా....నీ  ప్రేమ కోసం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

నవజీవన్ చెప్పారు...

మీ కవితలో ఎక్కడో నిరాశావాదం కనిపిస్తుందండీ....వేదనలో మనసు శోధనలో
మనిషి అంతరంగ ఆవిష్కరణ...పరదా మాటున మేలి ముసుగులో మోసపోతూ
దాస్య శృంఖలాలను తెంచుకోలేక....!!కొన్ని వాక్యాలు బాగున్నాయి నేస్తం...

చెప్పాలంటే...... చెప్పారు...

నిరాశావాదమైనా ఆశతోనే జీవితం అండి....మీ ఆత్మీయ స్పందనకు నా ధన్యవాదాలు జీవన్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner