అంబరాన్ని అందిస్తావని అనుకోలేదు
ఆశల శిఖరాన్ని అందనంత ఎత్తులో ఉంచావు
అధః పాతాళానికి నన్ను తోసేశావు
ఎండమావుల వెంట పరుగులు తీస్తూ
మలయ సమీరాన్ని కాలదన్నావు
మంచుపూల గంధాన్ని కాదన్నావు
మండుతున్న చితిలో హారతిని చూస్తున్నావు
మనసు నైవేద్యాన్ని నేలపాలు చేసావు
మనిషినే మరబొమ్మగా మార్చేసావు
బంధమైన అనుబంధాన్ని అల్లరిపాలు చేసావు
బతుకు నేర్పిన బాటను మరిచావు
అస్త వ్యస్త మలుపులతో అర్ధం లేకుండా
జీవితాన్ని ముగింపు లేని కధగా చేసి
చిత్రమైన వి చిత్రాన్ని చూస్తున్నావు
నువ్వు ఓ సగటు మని...షివే అని నిరుపించుకున్నావు....!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంజు కవిత బాగుంది. మీదైన శైలి గొప్పగా ఉంటుంది.
హృదయపూర్వక ధన్యవాదాలు అక్క....ఎలా ఉన్నారు
బాగున్నానమ్మా
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి