ఓం శ్రీ గురుభ్యోనమః....!!
ఓంకారం ఆది ప్రణవ నాదం...ఈ చరాచర సృష్టికి మొదటి నాదం...!! ఓంకారంతో నాద స్వరూపాలు రూపుదిద్దుకున్న సృష్టి స్థితి లయలకు ప్రణవ నాదమే ప్రాణ నాదం. మన జన్మకు కారణమైన అమ్మనాన్నలు తొలి గురువులు...నడత నడక, నడవడిక, విద్యాబుద్దులు నేర్పే గురువు అమ్మానాన్నలు కలసిన త్రిమూర్తుల ఏకరూపం...అందుకే గురువు పరబ్రహ్మ స్వరూపం..గురువు లేకుండా నేర్చుకున్న విద్య పరిపూర్ణం కాదని పెద్దల మాట...మన నిత్య జీవితంలో ఎందరో మనకు మార్గదర్శకంగా ఉంటూ మనల్ని తీర్చిదిద్దుతారు....అది ఏ రూపంగా అయినా కావచ్చు...చదువు సంధ్యలే కాకుండా జీవిత పాఠాలు నేర్పుతారు...అలా నేర్పిన ప్రతి ఒక్కరు మనకు గురు సమానులే...!! అందుకే పూజ్యనీయులైన గురువులందరికీ గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు...వందనాలు...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Teacher's day అని మీ ఉద్దేశ్యమనుకుంటాను! ఇవాళ శ్రావణ బహుళ అమావాస్య. ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అని పేరు.
నమస్తే ఈ రోజు గురుపూర్ణిమ కాదే! ఉపాధ్యాయ దినోత్సవం కదా అందులో ఇవాళ అమావసి
ధన్యవాదాలు అండి తప్పును తెలియజేసినందుకు
పొరపాటుకు మన్నించండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి