10, అక్టోబర్ 2013, గురువారం

ఇంకా నాతోనే ఉందని....!!

నాలోనే కరిగి నాతోనే ఉండి ఇన్నాళ్ళు...
ఇక నను వదలి పోయావనుకున్నా....!!

నాలోని సంతోషాన్ని బాధని
ఒక్కటిగానే నీతో పంచుకున్నా....!!

వేదనలో జారిపోయే కన్నీటి భాష్పాన్ని
సంతోషంలో స్రవించే అశ్రు ధారని నీలోనే చూసుకున్నా...!!

విసిగి వెళ్ళి పోయావనుకున్నా
వదలలేక నాతోనే ఉండి పోయావనుకోలేదు...!!

నాలో ఉండలేక బయటికి రాలేక
కంటిని తడుముతూ బుగ్గలపై జారిన నీ మనసు....!! 

చేతికి తగిలిన చెమ్మ చెప్పింది
నీ ఉనికి ఇంకా నాతోనే ఉందని....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ప్రేరణ... చెప్పారు...

చక్కగా రాశారు.

అజ్ఞాత చెప్పారు...

Heart touching....great feel

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ స్పందనకు నా వందనాలు ప్రేరణ గారు, అను గారు

Meraj Fathima చెప్పారు...

మంజూ, నా కామెంట్ మీకు నచ్చటం లేదా, లేక మిమ్మల్ని ఏమైనా నొప్పించానా, ఎందుకో నా వాఖ్యని మీరు పబ్లిష్ చేయలేదు, ఒకె మీరెప్పుడూ క్షేమంగా ఉండాలని కొరుకుంటూ,,,అక్క మెరాజ్

చెప్పాలంటే...... చెప్పారు...

అయ్యో అక్క అదేం లేదు కామెంట్ మోడరేషన్ కూడా ఏమి పెట్టలేదు నేను కాకపొతే నాకు మెయిల్ లో రావడం లేదు కామెంట్స్....ఎప్పుడు అలా అనుకోకండి

చెప్పాలంటే...... చెప్పారు...

మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడునూ

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner