7, అక్టోబర్ 2013, సోమవారం

జ్ఞాపకం గుండెల్లోనే....!!

చిరునామా చెదరి పోయిందా....
సంతకం చెరిగి పోయిందా....
చిత్రమే కనుమరుగైందా ...
జ్ఞాపకం గుండెల్లోనే దాగుందా...!!

వెతికి వెతికి వేసారి పోయాను
అలజడితో అతలాకుతలం అయ్యాను
చిరునామాల చిత్రంలో ఎక్కడైనా
నీ సంతకంతో చేరిన జ్ఞాపకాన్ని చూద్దామని...!!

సమీపంలోనే ఉన్నా చెప్పలేని సుదూరం
ఆంతర్యాల అహం పరదాల చాటున
అలికిడి లేకుండా అడ్డుగా ఉండి తొలగకుండా
సాన్నిహిత్యాన్ని చేరువ కానివ్వడం లేదెందుకో...!!

అక్షరాల ప్రవాహంలో ఊసుల వెల్లువలు
మౌన సమీరాల్లో మోహ సుగంధాలు
అన్ని కలిపి చెప్పిన భాషలేని భావన
నీ స్నేహ పరిమళాల అనుభూతిలోని ఆస్వాదననే...!! 

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Meraj Fathima చెప్పారు...

అన్యాయం కదా గుండెల్లో పెట్టుకొని ఊరంతా వెతకటం. చెల్లమ్మా... మంచి మనసున్న నిన్ను ఎవరు వదులుకుంటారూ....

Meraj Fathima చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

:) మీ అభిమాన ఆప్యాయతకు నా కృతజ్ఞతలు అక్కా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner