23, అక్టోబర్ 2013, బుధవారం

మనఃపూర్వక వందనాలు....!!

నా అక్షరాలు చెరగని శిలాక్షరాలుగా నిలిచిపోవానన్నంత ఆశ లేదు కాని శిధిలాక్షరాలుగా మాత్రం మిగిలి పోవాలని అనుకోలేదు...
నాకు అనిపించిన భావానికి అక్షర రూపాన్ని ఇవ్వగలను కాని నేను రాయాలనుకున్నది రాయలేను ...ఏదైనా రాయడమే కదా పెద్ద తేడా ఏముంది అని మీకు అనిపించవచ్చు కాని నాతొ రాయించేది మనసు.....మొదలు...ముగింపు రెండు నా చేతిలో ఉండవు...మనసు చెప్పిందే రాస్తాను కాని నేను రాయాలనుకుని రాయలేను.... అందుకేనేమో చాలా మంది నా టపాలు చూసి మా మనసులోని మాటలే మీరు రాశారు...అంటూ ఉంటారు అలా అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను రాసే టపాలు నా సంతోషమే కావచ్చు .... బాధే  కావచ్చు ... నేను చూసిన సంఘటనలకు మనసు స్పందనల అక్షర రూపమే కావచ్చు...భావావేశమే కావచ్చు.... అది ఏదైనా కానివ్వండి రాయాలనుకుంటే రాయలేను...రాయాలనిపించింది రాయగలను అదే రాస్తున్నాను....నా రాతలను వాటిలోని భావాలను ఆదరిస్తున్న...అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక వందనాలు

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"మా మనసులోని మాటలే మీరు రాశారు"...అంటూ ఉంటారు.
చాలా సంతోషం అనిపిస్తుంది.
అది సంతోషమే కావచ్చు .... బాధే కావచ్చు! చూసిన సంఘటనల మనసు స్పందనల అక్షర రూపమే ఆ భావావేశం అనుకుంటాను.
రాయాలనుకుని రాయలేను. మనసు మాటలే అక్షరాలుగా రాయగలను .... అదే రాస్తున్నాను.

ఔను ఏ భావుకురాలు/భావుకుడైనా అలాగే రాస్తారు. మీ ఆలోచనతో నేనూ ఏకీభవిస్తాను.
అభినందనలు మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ అభినందనకు వందనాలు చంద్ర గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner