వచ్చిన స్పందనలు చూసి నేనే కాస్త పాతకాలంలో

యుగాలు ఎన్ని మారినా ఆధునికంగా ఎంత ముందుకు వెళ్ళినా బంధాలను భాద్యతలను వదులుకోలేని ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పదు....అది ఆడ అయినా మగ అయినా ఒక్కటే....!! ఇక్కడ ఓ చిన్న సంగతి గుర్తు వచ్చింది నాకు..చిన్నప్పుడు మేము ఆరు చదివేటప్పుడు కొత్తగా ఆర్ధిక శాస్త్రం పెట్టారు అప్పుడే...దానిలో డిమాండ్ సప్లై నాకు గుర్తు వస్తోంది....మీకు అర్ధం అయ్యే ఉంటుంది ఇది ఎందుకు చెప్పానో...!! ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలకు తనకు ఏం కావాలో ఎలా కావాలో...తను ఎలా ఉండాలనుకుంటుందో...చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటోంది..అంతే కాని...నింగి కెగిరినా...ప్రపంచాన్ని చుట్టివచ్చినా....ఈ విశ్వాన్ని ఏలినా...ఇలా ఏం చేసినా...ఎంత ముందు ఉన్నా....ఆడవాళ్ళ రాతలు మారిపోయాయి అనుకుంటే పొరబాటే అది...!! ఏమి చేయలేక నిర్వికారంలో నిశ్చలంగా బతికే వాళ్ళు ఉన్నారు....ఆకాశం హద్దుగా ఆనందాన్ని అందుకునే వాళ్ళు ఉన్నారు...!! ఇప్పటికి మారనిది ఒక్కటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు, యాసిడ్ దాడులు చూస్తున్నాము కాని అబ్బాయిల మీద ఇలాంటివి జరగడం చూస్తున్నామా...!! 1900 అయినా 2013 కాని 2020 అయినా మారని నిజాల్ని ఒప్పుకోవాలి మనం...కాదంటారా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి