26, అక్టోబర్ 2013, శనివారం

లోపం ఎక్కడ...!!

అత్యాధునిక ఆ...భాగ్యనగరంలోనే నిర్భయ...అభయ... రేపు మరో పేరు మార్పు ....ఆధునికంగా ఎదిగిన అమ్మాయిలకు రక్షణ కరువైతే ఇక మాములు అమ్మాయిల సంగతి ఏంటి...?? చూస్తూ ఉంటే ఏమి తెలియని చిన్న చిన్న పల్లెలోనే అమ్మాయిలు  కాస్తయినా భద్రంగా బతకగలుగుతున్నారేమో అనిపించక మానదు. మనం ఆకాశంలో ఇల్లు కట్టుకుని ఉండగలిగినా కూడా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా జరుగుతున్న ఈ అమానుషాలను రూపుమాపాలంటే....?? వ్యవస్థలో మార్పు రావాలా లేక మన చట్టాల్లో మార్పు తేవాలా...!! మనలో మార్పు రావాలా...!! లోపం ఎక్కడ...!!
నేరం చేసినప్పుడు కొన్ని నేరాలను సాక్ష్యాధారాలతో నిరూపించలేని పరిస్థితి ఉంటే నేరం జరగనట్టే అని తీర్పు చెప్పే న్యాయస్థానం ఎంత వరకు న్యాయాన్ని కాపాడినట్లు...?? మహిళలకు జరుగుతున్న ఈ అన్యాయాలకు సాక్ష్యాలు, విచారణలు అవసరం అనుకుంటే ఎన్ని యుగాలు మారినా ఈ అమానుషాలు ఆగవు...అక్కడికక్కడే కఠిన శిక్షలు అమలు జరిగితే తప్ప ఈ నేరాలు ఆగవు..మన చుట్టూ ఉన్న సమాజంలో మంచి చెడు రెండు ఉంటున్నాయి కాని చెడు వెళ్ళినంత తొందరగా మంచి జనంలో చేరలేదు...కర్ణుడి చావుకి శతకోటి కారణాలన్నట్టు ఇది కూడా అంతే...!!
నేర ప్రభావం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండొచ్చు...మనం పెరిగిన వాతావరణం ఒక కారణం కావచ్చు...మనకు జరిగిన అన్యాయానికి మనలో దాగిన కసి కావచ్చు... పుట్టే ప్రతి బిడ్డ భూమి మీద పడేటప్పుడు నేరస్తులు కారు...ప్రతి తల్లి తన బిడ్డ గొప్పగా ఎదగాలని మంచి పేరు తెచ్చుకోవాలని కళలు కంటూనే ఉంటుంది...తన రాతను మార్చుకోలేక పోయినా బిడ్డలా రాతలు బావుండాలనే అనుకుంటుంది...మరో జీవితానికి శోకం అవుతారనుకుంటే పురిటిలోనే సమాధి చేయడానికి సిద్దపడుతుంది తల్లి మనసు...!! ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు...టి వి ప్రసారాలు... వేషధారణల్లో వచ్చిన మార్పులు...సాంకేతిక పరిజ్ఞానం...ఇలా చాలా కారణాలు నేరాలకు..అమానుష కృత్యాలకు దోహదం చేస్తున్నాయి...ప్రతి ఒక్కరు తమలోని చెడుని వదిలేస్తూ మంచికి నాంది తమ ఇంటి నుంచే మొదలు పెడితే కొన్నాళ్ళకు మంచి మానవత్వంతో మన సమాజం కళ కళలాడుతూ కనులకు ఇంపుగా ఉంటుంది...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

కొన్ని నేరాలను సాక్ష్యాధారాలతో నిరూపించలేని పరిస్థితి ఉంటే నేరం జరగనట్టే అని తీర్పు చెప్పే న్యాయస్థానం ఎంత వరకు న్యాయాన్ని కాపాడినట్లు...?? మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు సాక్ష్యాలు, విచారణలు అవసరం అనుకుంటే ఎన్ని యుగాలు మారినా ఈ అమానుషాలు ఆగవు .... సమాజంలో మంచి చెడు రెండు ఉంటున్నాయి కాని చెడు ఆకర్షించినంతగా మంచి మనిషిని ఆకర్షించలేదు .... కర్ణుడి చావుకి శతకోటి కారణాలన్నట్టు ఇది కూడా అంతే...!!
లొపం తెలిసీ లోపాన్ని వేలెత్తిచూపించలేని, నియంత్రించలేని దౌర్భాగ్యం.
ఆలోచనల కొత్త చిగురులకోసం మీరు పడుతున్న తపనకు అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు మీ అత్మీయ ప్సందనకు...

జలతారు వెన్నెల చెప్పారు...

మనుషుల్లో మార్పు రానంత వరకు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయండి.
మార్పు కోసం ఆశించడం తప్ప మనం చేయగలిగినది ఏమీ లేదు.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే వెన్నెల గారు మీరు అన్నది నిజమే చాలా రోజులు ఐంది మీ కామెంట్స్ చూసి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner