9, జనవరి 2014, గురువారం

నిన్ను ఇంకెలా వెదకను...!!

జ్ఞాపకాల నీడల్లో వెదుకుతూనే ఉన్నా
గతాన్ని కదుపుతూనే ఉన్నా
వాస్తవమై నువ్వెప్పుడు వస్తావని...!!

నిశీధి నీరెండలో చూస్తూనే ఉన్నా
ఏ మిణుగురు వెలుగుల్లో అయినా
కనిపించక పోతావా అని...!!

నీ మనసు మాయలో పడి
నన్ను నేను మరచి పోతానేమోనని
అనుక్షణం భయపడుతూనే ఉన్నా....!!

ఈ భయాల వెదుకులాటలో
దరి చేరని బంధాల భావాలు
నీకు తెలియకుండానే ఎన్నో  ఎన్నెన్నో....!!

చెలిమి తలపు మనసు మమత
మాయని మౌన వీచికలుగా తాకుతూ
నేనెక్కడో తెలియని నన్ను నీలో చూపించిన
నిన్ను ఇంకెలా వెదకను...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

జ్ఞాపకాల నీడల్లో
గతాన్ని కదుపుతూ వెదుకుతూ ఉన్నా
వాస్తవమై నువ్వొస్తావని....

అద్భుత భావన

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు ఆత్మీయ స్పందనకు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner