8, జనవరి 2014, బుధవారం

ఇది నిజం....!!

రంగుల జీవితాల్లో వెలసి పోయిన రంగుల చిత్రాలు ఇలానే తెల్లవారి పోతాయి కాబోలు ....మొన్న దివ్య భారతి నిన్న
స్మిత ఈ రోజు ఉదయ కిరణ్...రేపు మరెవ్వరో...!! ఏ జీవితాన్ని అయినా అధికారం..హోదా...డబ్బు...వారసత్వాలు ... ఇవే శాసిస్తున్నాయి...రంగుల జీవితాలయినా..మామూలు జీవితాలయినా పాకుడు రాళ్ళు ఉంటాయి... నడిచే దారి అంతా గులాబి రేకులే స్వాగతం పలకవు...గుచ్చుకునే గులాబి ముళ్ళు ఆ రేకుల పక్కనే దాగి ఉంటాయి...గుచ్చుకుంటున్నాయని బాధ పడుతూ ఉంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి..పోనీ అక్కడే ఆగిపోదామంటే అలవాటయిన అవసరాలు, దర్పాలూ ఊరుకోనివ్వవు మనసును...తెలియకుండా వచ్చిన పేరు ప్రతిష్టలు తెలిసి పోతూ ఉంటే తట్టుకోలేని స్వభావం...  సుఖానికి అలవాటు పడిన ప్రాణం కష్టాలను అలవాటు  ఇష్టపడదు...ఎందరున్నా ఎవరు లేని ఒంటరి తనాన్ని మిగులుస్తుంది...ఆ ఏకాంతమే ప్రాణాలను హరిస్తుంది  ఒక్కోసారి...!! అలా అర్ధాంతరంగా ముగిసి పోయిన జీవితాలు ఎన్నో  రంగుల ఊసరవెల్లుల ప్రపంచంలో...హోదా డబ్బు ఉంటే చాలు ఎంత వెధవ అయినా ఆకాశానికి ఎత్తుతారు భజన బృందాలు... వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో కుక్కల చావులకి కూడా ఎగేసుకుంటూ వెళ్ళి  సానుభూతి నాటకాలు వేస్తారు...అసలు రంగులు కనపడనీయరు...దాచేస్తారు.. ఇలా దాయడం అలవాటయిన బ్రతుకులు కదా...!!
ఒక్క కాకి చనిపోతే వందల కాకులు గుమికూడతాయి.... కనీసం వాటిని చూసి అయినా నీతులు చెప్పడం ఆపేసి మన తప్పులకు ఎన్ని జీవితాలు నేల రాలి పోతున్నాయో అని ఒక్క క్షణం మానవత్వంతో ఆలోచిస్తే ఈ రోజు ఉదయ కిరణ్ చనిపోయే వాడు కాదు...గొప్ప వారి ఫోటోలు పెట్టుకుని...సామాజిక న్యాయమంటూ అర్ధం తెలియని పదాలు చెప్తూ పార్టీలు పెట్టి దొరికినంత సొమ్ముకూడగట్టుకోవడం కాదు... పదవి కోసం అర్రులు చాస్తూ నైతిక విలువలు మరిచి పోయి...పాకులాడటం కాదు...ఆర్ధిక అవసరాలు, ఇంట్లో గొడవలు ఉదయ్ ప్రాణాలు తీసాయని చెప్తూ మన బాబులు అసలు కారణాన్ని మరుగున దాచేస్తున్నారు వారికి అందిన సూచనల మేరకు...ఈ ఉదయ కిరణం చిరునవ్వును చిదిమేసిన పాపం ఎవరిదో అందరికి తెలుసు....మీడియా, ప్రముఖుల కుటుంబాలు చాలా వరకు పెద్ద పెద్ద బాబులకు అయితే వెంటనే ఉరుక్కుంటూ వెళ్లి బూడిద తెచ్చే వరకు ఉంటారు...కనీసం సహా నటుడు చనిపోతే రాని ఆ పెద్ద పెద్ద బాబుల మనసులు ఎంత పెద్దవో ఇకనయినా అభిమానులు అర్ధం చేసుకోండి... మంచి ఎక్కడున్నా అభినందించండి....చెడు ఎంత పెద్దదయినా ఖండించండి...లేదా ఈ రోజు ఉదయ్ పరిస్థితే రేపు మరోకటికి వస్తుంది...ఇది నిజం....!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

రంగుల ఊసరవెల్లుల ప్రపంచంలో...హోదా డబ్బు ఉంటే చాలు ఎంత వెధవ అయినా ఆకాశానికి ఎత్తుతారు భజన బృందాలు... వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో కుక్కల చావులకి కూడా ఎగేసుకుంటూ వెళ్ళి సానుభూతి నాటకాలు వేస్తారు...అసలు రంగులు కనపడనీయరు...దాచేస్తారు.. ఇలా దాయడం అలవాటయిన బ్రతుకులు కదా...!!
అవును మంజు గారు రంగుల ప్రపంచం లో స్వచ్చత మచ్చుకు కనబడదు. అక్కడ తోడబుట్టిన వారూ కన్నవారూ కూడా పాత్రలే .... అనురాగాన్ని ఆత్మీయతను ప్రేమను చివరికి సానుభూతిని కూడా నటించడమే వారికి తెలుసు .... సున్నిత మనస్కులకు అక్కడ చోటుండదని మరోసారి ఋజువయ్యింది. మీ భావనల్తో నేను ఏకీభవిస్తున్నాను.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు

Karthik చెప్పారు...

It's exactly true, manju gaaru.

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u so much Karthik garu

తేజము చెప్పారు...

well said...

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner