పలకరింతలు లేకుండా విషయానికి వస్తున్నా.... నాకెందుకో నేను నాకే నచ్చడం లేదు ఈమధ్యన... ఎక్కడో విన్నట్టు గుర్తు... " తనని తాను ఇష్టపడలేని వాడు ఎదుటివారిని కూడా ఇష్టపడలేడు " అని... నిజమేనేమో కదా ఈ మాట... మనం మాత్రం దాచుకోవాలి ... ఇతరులవి అన్ని మనకు తెలియాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం..? అందరు మనలాంటి వాళ్ళే కదా... మరి ఎందుకు ఈ ముసుగు వేసుకోవడమో అర్ధం కావడం లేదు ... అందరికి సమస్యలు ఉంటాయి... అందరం చేసేది జీవిత యుద్దమే తప్పదు ఈ బతుకు పోరాటం... కనీసం మనతో మనం కూడా నిజాయితీగా ఉండలేనప్పుడు ఈ బ్రతుకుకే అర్ధం లేదు... వేసుకున్న ముసుగు ఎప్పుడో ఒకసారి జారిపోతుంది.. అప్పుడైనా వాస్తవాన్ని మనం చూడక తప్పదు...
ఆడ మగ మధ్య స్నేహం తప్పు కాదు.. పరిధులు దాటనంత వరకు ఏదైనా బావుంటుంది... ఈ విజాతి దృవాల ఆకర్షణలో పడటానికి, ఎవరి మీదో జాలి పడి, లేదా మాయ మాటల్లో పడి జీవితాలు అధోగతి పాలు కాకుండా చూసుకుంటే అందరికి మంచిది... మన అన్న వాళ్ళ బాగోగులు పట్టించుకునే క్షణం తీరికైతే ఉండదు కాని పై పై ప్రేమల బాగోగులు మాత్రం ఎంత బాగా కనుక్కుంటామో....మనకి అందరు తెలియాలి కాని మన గురించి ఎవరికీ తెలియ కూడదు అని మన స్నేహాన్ని సైతం దాచేయాలంటే ... మనకున్న స్నేహితులని బట్టే మనం ఏంటో తెలుస్తుంది అని భయమేమో... సమస్య మనదైనప్పుడు మనమే బాధ్యత తీసుకోవాలి కాని మరొకరి జీవితాన్ని సమస్య లోనికి నెట్టడం సరి కాదు.... నాలుగు కల్ల బొల్లి కబుర్లు చెప్పి నలుగురి జాలిని సంపాదించి బతికేద్దాం అంటే ఎలా కుదురుతుంది... " ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు " అన్నట్టు బయట పెట్టక మానరు.... లేదా బయట పడక మానదు.... అప్పటి వరకు అందరు సత్య హరిశ్చంద్రులే....అందరితో సరే కనీసం మీతో మీరు నటించకుండా ఉండటానికి ప్రయత్నించండి... ఇవి అన్ని చూస్తూ నేను అలా అయిపోతానేమో అన్న భయంతో నాకు నాకు నేను నచ్చడం లేదేమో నేస్తం....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి