26, ఏప్రిల్ 2017, బుధవారం

రోజా గారి ఉవాచ...!!

మొన్నీమద్య పేరున్న ఒక టి వి ఛానల్ వారి అటు ఇటూ కాని ఒక షోలో రోజా గారు చాలా చక్కని మాట చెప్పారు.
దానిలో నిజమెంతో మరి చూసిన వాళ్ళకు తెలియాలి.
నవ్వడం, నవ్వించడం అనేది ఒక కళ. ఒకప్పుడు రాజబాబు, రేలంగి, రమణారెడ్డి, మాడా, సుధాకర్ ఇలా చెప్పుకుంటూ పొతే చక్కని హాస్యాన్ని పండించేవారు సినిమాల్లో. ఈమధ్య మనకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ సినిమావాళ్ళే అతి జుగుప్సాకరమైన హాస్యాన్ని చిన్న తెర మీద ప్రదర్శిస్తున్నారు. అది హాస్యం వాళ్ళ దృష్టిలో. ఆడ మగ వేషాలు కూడా మగవాళ్ళే వేసేస్తూ పనికిమాలిన స్క్రిప్ట్స్ చేస్తూ, చిల్లరతనంగా ప్రవర్తిస్తూ ఉంటే వాటికి మహామహులు జడ్జీలుగా ఉంటూ వీళ్ళు వేసే కుళ్ళు జోకులకి పగలబడి వెకిలిగా నవ్వడాలు. ఈ షోల గురించి అందరికి తెలిసిందే  , ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు.
సరే ఇక అసలు విషయానికి వస్తాను. ఎన్టీ రామారావు గారి గురించి ఒక స్క్రిప్ట్ వేశారు. దానిలో మనకు అర్ధం ఐంది ఏంటంటే మనవరాలి వయసు ఉన్న అమ్మాయితో కూడా హీరోగా చేశారు అని. సరే అది కామెడి అనుకుందాం. దానికి రోజా గారు ముందుగా అన్న మాట ఇలా చేయాల్సి వస్తుంది అనే నేను సినిమాలు మానేసాను అని. నాకయితే  భలే నవ్వు వచ్చింది ఆ మాటకి. ఛాన్స్ రాక సినిమాలు మానేయడం కాదు, రేపు  బాలకృష్ణ కొడుకో, నాగార్జున కొడుకో ఈవిడని హీరోయిన్ గా రమ్మంటే అప్పుడు ఈ మాట అంటే బావుండేది. నోటి దురద ఉండొచ్చు కానీ మరి ఇలా ఉండకూడదేమో రోజా గారు. ఇంకా నయం బాహుబలిలో  శివగామి పాత్రకు రమ్యకృష్ణ బదులు ముందు నన్నే అడిగారు ఈ రాజకీయాల్లో పడి, అసెంబ్లీకి వెళ్ళే పనిలో పడి కుదరదని చెప్పాను అనలేదు.
చలనచిత్ర రంగానికే ఓ వెలుగు నందమూరి తారక రామారావు గారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు కూడా
ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటలు విని తెలుగు చిత్ర పరిశ్రమ ఎలా ఉరుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఎవరికీ వాళ్ళు నన్ను కాదులే అన్నది అనుకుంటున్నట్లు ఉన్నారు. ఆ షో లో రోజా గారి మాటల్ని ఖండించని  ఈ టి వి వారిని అనాలి. రామోజీరావు గారు ఎందుకు ఇంతగా విలువలను దిగజార్చుకుంటున్నారో వారికే తెలియాలి.
వయసు తగ్గట్టుగా, మన విలువను పెంచుకునే మాటలు మాట్లాడితే పార్టీ ఏదైనా మీ వ్యక్తిత్వానికి ఓ విలువ ఉంటుంది. డబ్బు కోసం, పలుకుబడి కోసం, పాపులారిటీ కోసం ఏదోఒకటి మాట్లాడితే ఎదురుదెబ్బలు తగలక మానవు ఎవరికైనా.
నిజానిజాలు మాత్రం నాకు తెలియదు. దీనిలో నాదేం లేదు. అందరికి తెలిసిన విషయాన్నే మళ్ళి చెప్పాను. -:). 

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

విసుకి వాడి మనస్సె ఒక విశ్వం... చెప్పారు...

చాలా బాగా చెప్పారు.. ఇంకానయం రచ్చబండ చూసినట్లు లేరు.. ఈవిడగారేదొ మహానుభావురాలులాగా చేసే OVER-ACTION చూస్తే జుగుప్స తప్ప ఏ ఫీలింగ్స్ రావు.

శ్యామలీయం చెప్పారు...

మీరు ఈటీవీలో వచ్చే ఆ చెత్తన్నర షో గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? బురదగుంట గురించి మాట్లాడుకొని ఏమి లాభం? సమకాలీన మీడియారంగంలో చివరకు యీ రామోజీరావుగారు కూడా తమ ఛానెల్లో ఇలాంటి ప్రోగ్రాం నిస్సిగ్గుగా నడిపిస్తున్నారంటెనే ఈ‌రంగం ఎంతగా భ్రష్టుపట్టిపోయిందో తెలియటం‌ లేదా మనకు? గొంగడిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయని వాపోవటం‌లాంటిదే కదా ఈప్రోగ్రాములు చూస్తూ వెఱ్ఱిగా ఉంటున్నాయనీ వెకిలిగా ఉంటున్నాయని వాపోవటమూను. ఢమడమచప్పుళ్ళ కొఱకొఱచూపుల పీడాకారం సీరియళ్ళ దరిద్రం ఒక వైపు ఐతే, జనం బుఱ్ఱల్లో తమతమ బ్రాంద్ల్ విషాలను ఎక్కించాలని ఊదరగొట్టే న్యూసెన్స్ న్యూస్‌ఛానెళ్ళు ఒకవైపు, రేటింగుతహతహలతో వేస్తున్న అసభ్యపుషోలు ఒకవైపు, భక్తి-భుక్తి వ్యాపారంచేసుకుంటున్న ఛానెళ్ళు ఒకవైపు - ఇలా నాలుగువైపులా ఈటివీమీడియా భూతాలు జనాన్ని చెండుకుతింటున్నాయి.

చెప్పాలంటే...... చెప్పారు...

నేను ఆ షో వస్తున్నప్పుడు చూడలేదు తరువాత వేస్తుంటే ఎందుకో చూసాను ఒక 5 నిమిషాలు. అప్పుడే ఇది విన్నా. అందుకే రాసాను. మీరు అన్నది అక్షరాలా నిజం అండి. మీ స్పందనలకు ధన్యవాదాలు.

గోవిందరావు చెప్పారు...

అయ్యా శ్యామలీయం గారూ/వారూ,
ఈ టపా రచయిత బాధ ఆ ప్రోగ్రాము ఎంత భ్రష్టుపట్టిపోయిందో కాదండీ..... డ్రైవర్ రాముడి మీద కామెంట్ చేసిందని.... అదుగో తోక అంటే ఇదుగో పులి పదిమందిని చంపింది అని మీరు మొదలెట్టారు
రామారావు కాలి గోర్లు ప్రపంచ యింతగా ప్రసిధ్ధి పొందాయని, వాటికి సరిపోఎవాళ్ళు లేరని జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నా...సూపర్

చెప్పాలంటే...... చెప్పారు...

Miku adokkate ardham ainanduky santosham govindarao garu.. dhanyavaadaalu.

చెప్పాలంటే...... చెప్పారు...

Miku adokkate ardham ainanduky santosham govindarao garu.. dhanyavaadaalu.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner