1. నా జీవితమే నువ్వు
జీవనదిలా మారి నా అక్షరాల్లో నిరంతరం ప్రవహిస్తూ....!!
2. నా ఆస్వాదనలే నీవు
విడివడని భావాలకు జత చేరిన అక్షరాలుగా మారతూ..!!
3. వలచి వచ్చిందో చెలిమి
వలసపోయే జ్ఞాపకాలను వెంటేసుకుని...!!
4. మనసుని పరికిస్తున్న క్షణాలివి
మౌనానికి మాటల అలంకారాలద్దేస్తూ...!!
5. కథ ముగిసింది
కల జీవితమని తెలిసే సరికి...!!
6. మనసును మాలిమి చేసుకున్న జ్ఞాపకం
కాలానికి చిక్కని పరిమళపు గుభాళింపుతో..!!
7. కల్లలేగా చెంతనుంది
కలలన్నీ వీగిపోయాక...!!
8. అమ్మ బడిలో నేర్చుకున్నందుకేమెా
అక్షరానికింత ఆప్యాయత నేనంటే...!!
9. వెన్నెలంతా నవ్వుల్లో ఒలికింది
కవితాక్షరాలన్ని మది సిరాలో ముంచి రాయాలని అనుకుంటే...!!
10. బంధమై చేరినందుకేమెా
బాధ్యతగా మిగిలిపోయాను...!!
11. గతజన్మ పరిమళమనుకుంటా
ఈ జన్మలోనూ వదలక వెన్నాడుతోంది...!!
12. మెాహం సమ్మెాహనమైంది
స్నేహ పరిమళమై చెంత చేరుతుంటే...!!
13. మదిగమకాలు స్వరాలు ఆలపిస్తూ వెంటబడుతోంది
నిశ్శబ్ధ రాగాన్ని పరిచయం చేయడానికేమెా....!!
14. ఏకాంతం చేరువయ్యింది ఎందుకో
నీ తలపులనందించాలని కాబోలు..!!
15. కాలమే నాతో ఉండిపోయింది
నిన్ను విడలేని బంధమై....!!
16. జీవితాన్ని గెలవాలనుకుంటున్నా
ఓడిన మనసుకు ఓదార్పుగా నిలుస్తూ....!!
17. కవిత్వంలోని జ్ఞాపకమే నీవు
అక్షరాలన్నింటా భావమై ప్రవహిస్తూ ....!!
18. తనంతే ఓ జ్ఞాపకం
మదిలో చెదరని మనసాక్షరం...!!
19. చీకటితోనే సహజీవనం
నీవు లేవన్న భావనకు తావీయక...!!
20. వశమయ్యింది కాలం
గెలుపోటముల క్షణాలకు...!!
21. రాగమెుప్పని భావాలైనాయి
అక్షరాలు జతగూడకేమెా...!!
22. అరవైయ్యారు కళల అవపోశనం
రాధామాధవ రమ్య చరితం....!!
23. ఆవహించిన చైతన్యమిప్పుడు
నాలోని స్వరం నీదై పలికితే...!!
24. కలలన్ని తెలిసినదానవు
కల్లలు చేయదగునా... !!
25. చిరునామా అక్కర్లేని చెలిమి
ఎదలో శాశ్వతంగా నిక్షిప్తమై...!!
26. భాష మధురం
మనసులను తడుముతున్నందుకనుకుంటా...!!
27. లెక్కకు రాని క్షణాలేనన్నీ
నీతో కలిసున్నప్పటి కాలానికి....!!
28. అక్షర సన్యాసమే
కన్నీళ్ళు కరవాలాలై కాపు కాస్తుంటే...!!
29. తీరని మచ్చట్లకే
ఆ తీపి జ్ఞాపకాల తలపు....!!
30. మనసుదేముంది మరలిపోతుంది
కాలం పూసే మరపు లేపనంతో....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి