20, జనవరి 2021, బుధవారం

అందరికి ధన్యవాదాలు..!!

నేస్తాలు, 
     ఓ పుష్కర కాలంగా నా రాతలు ఈ అంతర్జాలంలో కబుర్లు కాకరకాయలు అన్న బ్లాగు ద్వారా మెుదలయ్యాయి. 2009 జనవరిలో రూపుదిద్దుకున్న కబుర్లు కాకరకాయలు బ్లాగులో ఇప్పటికి 2000 పై చిలుకే పోస్టులయ్యాయి. 
    పుస్తకాలు చదవడం మాత్రమే అలవాటున్న నేను ఇలా రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సరదాగా బ్లాగులో రాయడం మెుదలైన వ్యాపకం ముఖపుస్తకానికి జత చేరి ఇలా మీ అందరి పరిచయాన్ని, అభిమానాన్ని అందించింది. 
    అమ్మ నేర్పిన అక్షరం చేసిన మాయాజాలమిదంతా. అక్షరం మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదని తెలియజేసింది. మితాక్షరాలతో అనంతమైన భావాలను ఎలా అందించవచ్చో నేర్పింది. నిరాశలో ఉన్నప్పుడు ఆశల ఆనందాలను ఎలా అందుకోవచ్చో తెలిపింది. మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చో చెప్పింది. అక్షరాన్ని ఆయుధంగా ఎలా ప్రయెాగించాలో చూపించింది. మన శత్రువులను, మిత్రులను తెలియజెప్పింది. నా అన్న వారి నైజం తేటతెల్లం చేసింది. బంధువులను, రాబంధువులను గుర్తెరిగేటట్లు చేసింది. అమ్మ తొలి గురువైతే అక్షరం తొలి నేస్తమయ్యింది. మంచి చెడులను తెలియజెప్పిన ఆత్మబంధువులా అక్షరం అక్కునజేరింది. 
       పాతికేళ్ళు ఎలా గడిచాయెా తెలియకపోయినా మరో పాతికేళ్ళు పాతిక జన్మల అనుభవాలను మిగిల్చాయి. మనిషిలోని బహు ముఖాలను పరిచయం చేసాయి. గతాన్ని వదిలేయమని చాలామంది చెప్తారు. కాని అంత సులభం కాదు. మంచైనా చెడైనా కొన్ని సంఘటనలు మనసులో స్థిరంగా ఉండిపోతాయి. కొందరు జ్ఞాపకాలతో బతికేస్తుంటే, మరి కొందరు జ్ఞాపకాలే లేకుండా బతికేస్తుంటారు.  ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయంతోనే మన సంతోష విషాదాలు నిర్ణయింపబడతాయి. నిర్ణయం మనది కనుక ఏదైనా భరించక తప్పదు ప్రాణం పోయేవరకు. 
        అనుకోని ఈ పుష్కర కాల అక్షర ప్రయాణంలో నాకెదురైన శత్రువులకు, మిత్రులకు అందరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

citizen చెప్పారు...

Reading your blogs had been a great experience .
Congratulations for reaching this 12 years milestone. It is really hard to achieve this.
So many blogs had been dissolved in time over the years.
It is commendable to continue the blogs regularly in spite of health issues.
Appreciate you for taking time and thanking everyone on reaching this beautiful milestone.
All the best for the future as well.


చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner