ప్రముఖ కవయిత్రి, రచయిత్రి మంజూ యనమదల గారి "జీవన మంజూష"
పుస్తకం చదివితే ఏనాడో ఆంధ్రప్రభ వార పత్రికలో ధారవాహికంగా ప్రచురితమైన తెన్నేటి హేమలత గారి"ఊహా గానం" చటుక్కున గుర్తుకు వస్తుంది. ఈ నాడు నవమల్లెతీగ లో వచ్చే జీవన మంజూష వ్యాసాల కోసం ఎదురు చూసినట్లు గానే ఆ రోజుల్లో టీనేజ్ లోనే వారం వారం ఊహాగానం కోసం ఎదురు చూసేవాడిని. లత గారి వ్యాసాలలో భావుకత, మంజూ గారి వ్యాసాల లో వాస్తవికత కొట్టొచ్చినట్లు కనబడతాయి.
కుల మత వర్గ రాజకీయ పరంగా నేటి సమాజంలో (కుటుంబాల తో సహా) జరుగుతున్న కుసంస్కార, వికృత పోకడలను ఆమె నిర్మోహమాటంగా , నిర్బీతిగా ఎండగట్టారు....చీకొట్టారు... ఘాటుగా సుద్దులు చెప్పారు.
అలా చేయకుండా ఆమె చూస్తూ ఊరుకోలేదు. అది ఆమె నైజం (అదంతా
లోపల దాచుకోకుండా ప్రతిస్పందించక పోతే ఆమెకు నిదుర పట్టదు. లావై పోతాననే భయంకూడా నేమో!!! ) ఏ రంగంలో నైనా సరే చెడును సహించ లేదు... అక్షరాయుధలతో విరుచుకు పడుతుంది. ఆరోగ్యం సహకరించక పోయినా తన రచనల ద్వారా సామాజిక బాధ్యతను నూటికి నూరుపాళ్లు ఆదర్శ ప్రాయంగా నిర్వహిస్తున్న రచయిత మంజూకు అభినందనలు.
....... డా. డి. ప్రసాద్.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి