23, జులై 2024, మంగళవారం

మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని పుస్తక సమీక్ష

          తప్పిపోయిన కాలాన్ని దాచినమిగుల్చుకున్న వాక్యాలు కొన్ని”..!!


      అలసిన వాక్యాలు కొన్ని తప్పిపోయి ఇలామిగుల్చుకున్న వాక్యాలు కొన్నిగా రూపరుక్మిణి కె కవితా సంపుటిగా రూపుదాల్చాయి. సవ్వడి చేయని శబ్దాలుగా తన భావాలను చాలా బలంగా కవితా సంపుటిలో వినిపించారు. రాజకీయాలను, రణ నినాదాలను అక్షరాలకు బాగా వొంటబట్టించారు. అద్దాన్ని- అబద్ధాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. తన రన్నింగ్ కామెంట్లు తో మసకబారుతున్న మానవత్వాన్ని చూపించారు. నిసర్గలోఎప్పుడో తప్పిపోయిన నీడ నీరెండ గాయంలా ఎదురైందంటూఅద్భుత భావాన్ని అందించారు. మనసు నీడ అక్షరాల్లో దాగుందని దానిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ.. మరెన్నో చక్కని కవితలను మిగుల్చుకున్న వాక్యాలు కొన్నికవితా సంపుటిలో అందించారు

      సమాజం పట్ల తన బాధ్యతను ప్రతి కవితలోనూ చూపించారు. మరిన్ని గొప్ప గొప్ప పుస్తకాలు వీరి నుండి రావాలని కోరుకుంటూ..చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన్నించమని కోరుకుంటూ..శుభాభినందనలు..!!



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner