20, మే 2026, బుధవారం

కొన్ని మాటలు..!!

 నేస్తాలు,

               మనం పొందిన సాయంలో కొంతయినా తిరిగి ఇవ్వడమనే సంస్కారం మనలో చాలామందిలో లోపించినందుకు చాలా బాధగా వుంది. మనం ఎవరెవరికి ఏం చేసామన్నది మనకు తెలుసు. ఆ సాయం అందుకున్న వారికి తెలుసు. కనీసం ఏ క్షణమయినా ఆ చేయూతను గుర్తుంచుకోక పోవడమన్న సంస్కారం వారికున్నందుకు చాలా సంతోషంగా వుంది. 

              2008 లో మెుదలు పెట్టిన మా “ఉప్పల రాజ్యలక్ష్మి” చారిటబుల్ ట్రస్ట్ నుండి సాయం పొందినవారు చాలామంది వున్నారు. మేమిచ్చేది వారికి చిన్న మెుత్తమే కావచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు, ఒక్క కరోనా సమయంలో తప్పించి ప్రతి సంవత్సరం 70000 నుండి 110000 వరకు ఇస్తూనే వున్నాము. మేము బయట ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. నా చిన్ననాటి నేస్తం “జవహర్ బాబు తుంగల” తన దసరా బోనస్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. 

           దాదాపుగా 17 సంవత్సరాలుగా ఇస్తున్నా ఇప్పటి వరకు సాయం పొందిన వారిలో ఏ ఒక్కరూ ఒక్క రూపాయి తిరిగి సాయం చేసిన సందర్భం లేదు. మనిషి ఎందుకు ఇంతలా దిగజారి పోతున్నాడో అర్థం కాని పరిస్థితి. 

              గత ముప్పై సంవత్సరాలుగా నేను చూసిన, అనుభవించిన జీవితంలో నాచే సాయం పొందిన అమెరికా, భారతదేశంలోని ఎంతోమంది..ఈరోజు కనీసం మాటలకే నోచుకోవడంలేదు. చాలా కొద్దిమంది తమ అభిమానాన్ని ఈరోజుకి పంచుతున్నారు నా చేత ఏ సాయమూ పొందక పోయినా. ఇది మనిషి సహజ లక్షణం. 

                  మనిషిగా పుట్టినందుకు కాస్తయినా మనిషిగా అందరు బతకాలని ఆశ. ఎంతో చెప్పాలని వున్నా చెప్పడానికి ఇష్టం లేక ఇంతటితో సెలవు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner