6, మే 2026, బుధవారం

పలకరింపు..!!


మన అనుకున్న బంధాలన్నీ

అనుబంధాలు కాలేవు


మాట్లాడే మాటలన్నీ

మనసులను తాకలేవు


రాసే రాతలన్నీ

జీవకళను ఆపాదించుకోలేవు


పలకరించే పలకరింపులన్నీ

హృదయాలను కదిలించలేవు


ఆడే ఆటలన్నీ

విజయాన్ని అందుకోలేవు


బతికే బతుకులన్నీ

నిజాయితీగా బతకలేవు


చరిత్ర పుటలన్నీ

చిత్తుకాగితాల ఆనవాళ్ళు కావు


గతించిన కాలాలన్నీ

భవితకు మేలుకొలుపుల గుణపాఠాలు..!!




 









0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner