ఆశే
ఆవిరయినప్పుడు
కోరికెక్కడ!
బంధమే
లేనప్పుడు
అనుబంధమెక్కడ!
నమ్మకమే
నిలబడనప్పుడు
నిజాయితెక్కడ!
మాటలే
మరిచినప్పుడు
మాధుర్యమెక్కడ!
మనసే
మాయమైనప్పుడు
మమకారమెక్కడ!
మనిషే
కానప్పుడు
మానవత్వమెక్కడ!
గతమే
మరిచినప్పుడు
గురుతులెక్కడ!
జీవమే
కోల్పోయినప్పుడు
జీవితేచ్చెక్కడ!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి