17, జనవరి 2011, సోమవారం

ఈనాటి వైద్యం

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు, కాని నాటి నుంచి ఈనాటికి డబ్బుల నైవేద్యం ఉంటేనే వైద్యం అన్నట్లు వుంది. వైద్యుని దేవునికి ప్రతిరూపంగా భావిస్తాము. శారీరకమైనా, మానసికమైనా, ఇంకా ఏ రూపంగానైనా ఇబ్బంది వస్తే వైద్యుడు చెప్పిందే వేదవాక్కు మనకు. ఒక అమ్మాయికి రెండు సార్లు అబార్షన్ అయితే మూడోసారి మొదటి నుంచి భాగ్యనగరంలో అద్దెకు ఇల్లు తీసుకుని నెలలు నిండే వరకు డాక్టర్ పర్యవేక్షణ లో వుంటే వాళ్లకు చివరకు మిగిలిన బహుమతి చనిపోయిన పాప. వేరొకరికి బెంగుళూరులో పేరున్న పెద్ద హాస్పటల్లో ఎనిమిదో నెలలో తేడా అనిపించి వెళితే ఐదు, ఆరు రోజులు ఏమి జరిగిందో కుడా చెప్పకుండా కదలికలు లేవు చూద్దాము అని చెప్పారు. తరువాత విశాఖ లోని మరో పేరున్న హాస్పటల్లో నెలలు నిండే వరకు చూపిస్తుంటే రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి తరువాత బాలేదని వెళితే ఆఖరుకి ఆపరేషన్ చేసి చనిపోయిన పాపని ఇచ్చారు.
పూర్వకాలంలో అవకాశాలు లేక ఇలాంటి సంఘటనలు చాలా జరిగేవి. అన్నిరకాలుగా ఎంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న,
విజ్ఞానమున్న, విజ్ఞులున్న ఈ రోజులలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇది ఎవరి నిర్లక్ష్యం?
అనుకోవాలి. అందరూ బాధ్యతలేని వారు కాదు,
పనిలోనే దైవత్వాన్ని చూసే వారు కొందరుంటే డబ్బుని చూసే వారు మరికొందరు, ప్రాణాలతో చెలగాటమాడే వారు ఇంకొందరు. ప్రాణం పోసేందుకే వైద్యం కాని తీసేందుకు కాదని వైద్యాన్ని అందరికి అందుబాటులో ఉండేలా చేయాలని కొంత మంది తపన పడే మహా యజ్ఞంలో నిస్వార్ధంగా మీ చేయి అందించాలని ప్రతి ఒక్క వైద్యనారాయణుని అర్ధిస్తున్నాను.

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

చాల మంచి పోస్ట్ చేశారు. సమాజంలో జరుగుతున్నా అన్యాయలకు మీ స్పందన చాల బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

నా స్పందన కాదు కావాల్సింది డాక్టర్ల సేవ సహృదయం కావాలి. నిన్ననే చాలా చిన్న అమ్మాయి ప్రియ అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన కొన్ని రోజులలోనే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది. ఎవరి నిర్లక్షమైనా కానియండి ఓ తల్లికి తీరని కడుపుకోతని మిగిల్చిన ఈ సంఘటన కి భాద్యులు ఎవరు?

అజ్ఞాత చెప్పారు...

డాక్టర్ల పర్యవేక్షణలో అలా అకాలమరణం చెందడం దురదృష్టకరం. అలా అని, వారి నిర్లక్ష్యం వుంటే తప్ప, డాక్టర్లను మాత్రమే తప్పు పట్టలేము. వాళ్ళ ప్రయత్నం వారు చేసివున్నా, వాళ్ళచేతుల్లో లేనిది ఏదో వుంటుంది, అదే 'విధి '. విధి బలీయమైనది అంటారు.

చెప్పాలంటే...... చెప్పారు...

డాక్టర్లకు తెలుస్తుంది కదా కేసు గురించి.....విధి నుంచి ఎవరము తప్పించుకోలేము, నిర్లక్ష్యం వున్న వారి గురించే అనుకునేది, కొంత దురదృష్టము కుడా వుంటుందిమీరన్నట్లు

jawaharbabu చెప్పారు...

ma ammai putta taniki mundu delhi lo modata vo doctor daggariki vellinapudu weak positive. vakoti 1500/- injections vadali aina guarantee cheppalem andi.tarvata enko doctor daggara kellam.ame nijamga chala great.ame skill valle pregnancy nila badindi.vellina modati roje ame cheppindi worry avvakkarledu.anta manchi ga jarugutundi ani.kabatti saraina doctor dorakatam mana adrustanni batti kuda vuntundi...

చెప్పాలంటే...... చెప్పారు...

సరైన డాక్టర్ అయితే కరక్టుగా చెప్పగలుగుతారు ఏదైనా....మీరు చెప్పింది నిజమే అది అదృష్టం మీద ఆధారపడి వుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner