3, మార్చి 2011, గురువారం
బెస్ట్ అఫ్ లక్ ఇండియా.....
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే లక్ష్యం అదే అదే ఈ సారి ప్రపంచ కప్ సొంతం చేసుకోవడం....టీం ఇండియా ధ్యేయం కావాలి.
నిన్నటి ఐర్లాండ్ ఆట తీరు చూసి మన వాళ్ళు నేర్చుకోవలసినది చాలా వుంది. ప్రపంచ కప్ లో తొలి అడుగు దగ్గర నుంచి ఐర్లాండ్ ఆట తీరు చాలా బాగుంది. ఆ పోరాట పఠిమే మన వాళ్లకు కావాలి...ప్రతి ఒక్క ఆటగాడి లక్ష్యం చివరి వరకు గెలుపు మీదే వుండాలి. ఎవరు వున్నా లేక పోయినా ప్రతి ఒక్కరు తమ ఆటకు న్యాయం చేయాలి. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాటమే లక్ష్యం కావాలి. ప్రపంచకప్ లో ప్రతి ఒక్క బాట్స్ మాన్ పరుగులు చేద్దామనే అనుకుంటారు, అలానే ప్రతి ఒక్క బాల్ కి వికెట్ పడగొట్టాలని బౌలర్ అనుకుంటాడు. సంకల్పబలం తో ముందుకి అడుగు వేస్తే విజయం మనదే.....
కోట్లాది భారతీయుల కలని నిజం చేసే సత్తా వుండి కుడా ప్రపంచకప్ గగన కుసుమం ఐపోయింది మన టీం ఇండియాకి.
గతాన్ని ఘనం గా చెప్పుకోవడం తప్ప విజయాన్ని అందుకోలేక పోతున్నాము. ఈ సారి అయినా కోట్లాదిమంది భారతీయుల ఆశలను, కలలను నిజం చేస్తూ ప్రపంచ కప్ తో మన టీం ఇండియా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని రావాలని కోరుకుంటూ.......బెస్ట్ అఫ్ లక్ ఇండియా.....
లైవ్ స్కోరు....ఇతర వివరాల కొరకు ఈ క్రింది వెబ్ సైట్ ని చూడండి
www.cricdude.com
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నిజమేనండీ,
వరల్డ్ కప్ అంటే కపిల్ గుర్తొస్తాడు
ఈసారన్నా కల నెరవేరుతుందని ఆశిద్దాం
నాకు అంతే అండి లతా!! శ్రీలంక కి మొదటిసారి కప్ వచ్చినప్పటి నుంచి క్రికెట్ చూడటం మానేసాను.చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా నాన్న అలవాటు చేసారు బాగా చిన్నప్పటి నుంచి.మన వాళ్ళ ఆట తీరు చూసి బాధ వేసి చూడటం మానేసాను కాని కప్ వస్తే బావుండు అనిపిస్తుంది కదా...ఎందుకంటే మనం భారతీయులం కదా మరి!! :)
మనదేశం ఈ ప్రపచకప్ సాదించాలని మనసారా కోరుకుంటూ "బెస్ట్ అఫ్ లక్ ఇండియా"
మన అందరి కోరికా అదే రాధికా....థాంక్యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి