7, మార్చి 2011, సోమవారం

ఆత్మహత్యలు ఎందుకు..??

క్రిందటి వారం విన్న ఓ విష్యం మనసును బాగా కలచి వేసింది.
అందరికి సమస్యలు వుంటాయి చిన్నవో చితకవో...మనది మనకు చాల పెద్దది గా ఆ బాధ ఎవరు పడలేదేమో అనిపిస్తుంది. అలా అని ప్రతి సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఇంతమంది జీవించి వుండేవారు కాదేమో!!
ఎన్ టి వి లో లైవ్ ఇంజనీర్ గా పని చేసే ఒకతను హెచ్ ఆర్ లో వేధింపులు తట్టుకోలేక తనకు ఇష్టం లేక పోయినా బతకాలని ఎంతో వున్నా అర్ధాంతరంగా జీవితాన్ని బలవంతంగా ముగించుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు...పద్దెనిమిది నెలలు, రెండు నెలలు వున్న చిన్న చిన్న పిల్లలు , భార్యకు కుడా పెద్ద వయసు లేదు చిన్న అమ్మాయి. బాగా లేని వాళ్ళు. తను చని పోయే ముందు రాసిన ఉత్తరంలో హెచ్ ఆర్ వేధింపులు తట్టుకోలేకనే ఇష్టం లేక పోయినా బలవంతం గా రాజీనామా చేయించారని, అందుకే చనిపోతున్నానని రాసి, ఇంక ఎవరికీ అలా వేధింపులు లేకుండా చేయమని ఆఖరి కోరిక కోరాడు. మరి యాజమాన్యం ఎంత వరకు స్పందిస్తుంది అనేది, బడాబాబులకు కొమ్ము కాసే పోలీసులు, చట్టం ఇలాంటి అన్యాయాలకు ఎలా న్యాయం చేస్తారనేది ప్రశ్నార్ధకమే?? వాళ్ళను తలచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తోంది....పోయిన వాడు పోయాడు బతికి వున్న వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఏ సమస్యకు అయినా చావు పరిష్కారం కాదు. చనిపోవాలని అనుకున్నప్పుడు ఒక్క క్షణం మీ మీద ఆధారపడిన కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి.....!! పిరికి వాళ్ళలా సమస్యకు తలవంచకండి. ధైర్యం గా ఎదుర్కోండి....ఆ క్షణంలో మీ ఆలోచనను దారి మళ్ళించండి, ఓ మంచి జీవితం మీకు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి దొరుకుతుంది. అంతే కాని అందరిని నట్టేట్లో ముంచి మీ మానాన మీరు వెళిపోతే మీ కోసమే బతికే వారి గతి ఏంటి? అని ఒక్క క్షణం ఆత్మ విమర్శ చేసుకోండి. భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చిన అందమైన జీవితం మన సొంతం అవుతుంది. సమస్యతో పోట్లాడండి...తప్పక అది మీకు తలవంచి విజయాన్ని అందిస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వుంది. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు గుర్తు ఉంచుకోండి...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

అవునండీ,అసలు బలవంతంగా ప్రాణం తీసుకునే ధైర్యం ఎలా వస్తుందో నాకు ఎప్పుడూ అర్ధం కాదు.

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమోనండి లతా!! ప్రాణం తీసుకునే ధైర్యాన్ని బతకడానికి దానిలో కొంత తీసుకుంటే చాలు కాని అది అర్ధంకాక ఇలా చేస్తున్నారు

veera murthy (satya) చెప్పారు...

బాధలపై ప్రాణంతో వుండి తీర్చువాల్సిన ప్రతీకారాన్ని,
ప్రాణాలని తీసుకొని తీర్చుకోవడం బాధలని గెలిపించడమే!

చెప్పాలంటే...... చెప్పారు...

అవును మీరు చెప్పింది ముమ్మాటికి నిజం కోపం కష్టాలపై వుండాలి కాని జీవితం పై కాకూడదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner