17, మార్చి 2011, గురువారం

ఏటి ఒడ్డున..... సెలఏటి మాటున....!!

మబ్బుల మాటునున్న పున్నమి చందురుని రూపం
కనపడి కనపడని నీటిలోని ప్రతిబింబపు వెలుగులలో
నడిరేయిలో, మలిఝాములో, సడిలేని ఏకాంతంలో
నీ తలపులు చుట్టుముట్టి నాతో సరాగాలాడుతుంటే
జాడ లేని నీ కోసం పైరగాలి పిల్లతెమ్మెర
సున్నితంగా తాకి వెళిపోతూ వుంటే
మదిలోని నీ రూపం కనుల ఎదుట
కనపడే క్షణం!! ఏదో చెప్పాలన్న ఆరాటంలో
ఏమి చెప్పలేక మూగబోయిన గొంతు సవ్వడి
మాటల్లేని మౌన నిశ్శబ్దంలో వినిపించే అంతే లేని
ఆశల ఊహల ఊసులు, కలల సౌధాలు....
నీకు చేరాయో లేదో!!
(మాలా గారు ఈ ఫోటోకి కవిత రాయమంటే.....)

16 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

బ్యూటిఫుల్, అంత కరెక్ట్ గా ఫొటోకి సరిపొయేట్టు చాలా బాగా రాశారు

చెప్పాలంటే...... చెప్పారు...

నిజంగానా లతా.....థాంక్యు థాంక్యు చాలా సంతోషం గా వుంది మరి మాలా గారు ఏమంటారో !!

సుమలత చెప్పారు...

బాగుందండీ బాగా రాసారు

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు సుమలత గారు

మాలా కుమార్ చెప్పారు...

మంజు ఆ అమ్మాయి కళ్ళల్లోని ఊహలు , ఊసులు చాలా బాగా వర్ణించారు .
అడగగానే రాసినందుకు ధన్యవాదాలు .

చెప్పాలంటే...... చెప్పారు...

మీకే నచ్చుతుందా లేదా అని భయపడ్డాను....థాంక్యు మెచ్చుకున్నందుకు మాలా గారు

హను చెప్పారు...

chala baga chepparu.... superb.....

Lakshmi Raghava చెప్పారు...

బొమ్మ అచ్చు తన భావాలను మాకు చెప్పినట్టే వుంది . మీరెంత బాగా తన మనసులో దూరి భావాలను పలికిన్చారండి..చాలా బాగుంది..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు హను గారు

చెప్పాలంటే...... చెప్పారు...

అంత బాగా చెప్పానంటారా!! థాంక్యు లక్ష్మి రాఘవ గారు

శ్రీలలిత చెప్పారు...

చిత్రాన్ని చదివినట్టు రాసేసారు. బాగా రాసారు...

చెప్పాలంటే...... చెప్పారు...

నిజంగానేనా !! శ్రీలలిత గారు మీరు కుడా పొగుడుతుంటే భలే సంతోషం గా వుంది :) థాంక్యు అండి

Rao S Lakkaraju చెప్పారు...

నీ తలపులు చుట్టుముట్టి నాతో సరాగాలాడుతుంటే
------
గ్రేట్

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా సంతోషం గా వుంది రావు గారు థాంక్యు

జ్యోతి చెప్పారు...

చిత్రానికి తగ్గట్టుగా ఉన్నాయి అందరి కవితలు. మీ కవిత కూడా చాలా అందంగా ఉంది..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు జ్యోతి గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner