ఎప్పుడూ నీతో కబుర్లు చెప్పాలనే వుండేది....
నీతో మాటలు మొదలు పెట్టాక...
అంతులేని ప్రవాహంలా అలా వస్తూనే వున్నాయి....
ఓ పక్క భయం.. మరో పక్క దిగులు...
నా మాటలతో నీకు విసుగేమో అని భయం!!
మాటలు లేని మౌనాన్ని చూస్తే దిగులు...
ఎప్పటికీ మాట్లాడలేనేమో అని....
అమ్మ ఆవకాయ్ ఎప్పటికీ విసుగు రానట్లే
నేను కుడా నీ తలపుల్లో అలానే ఎప్పటికీ ఉండిపోవాలని....!!
7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీ చిన్ని చిన్ని కవితలు బావుంటున్నాయండీ
మనసెరిగి మాట్లాడిన మాటలు
ముసుగులు లేని మనసులో మాటలు
ఎంత మాట్లాడినా విసుగు రావు...
ఎంత కాదన్నా మరపు రావు,
-satya
తెలుగుదనపు గరువం,పరువం,ఎన్నడూ మరువం!అనిపించారు ఈ కవిత ద్వారా.
చాలా సంతోషం గా వుంది సోమార్క గారు మీకు అంత బాగా నా కవిత నచ్చినందుకు థాంక్యు అండి
కదా సత్య గారు కొంత మందికి కొన్ని రోజులు మాట్లాడిన తరువాత పాత గా అయిపోయి కనుమరుగు ఐపోతారు అంటున్నారు.....:) మీ కామెంట్ కి థాంక్యు
నేను ఏది రాసినా మొదటి అభినందన మీదే లత గారు....చాలా చాలా సంతోషం అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి