31, మార్చి 2011, గురువారం

కొన్నాళ్ళకు కనుమరుగయ్యేవి......

గతాన్ని మర్చిపోలేము....జ్ఞాపకాల్ని మర్చిపోలేము....
బంధాలు అనుబంధాలతో మిళితమైన జ్ఞాపకాలు...
అవి పంచిన అనుభూతుల పరిమళాల ఆస్వాదనలు
ఎప్పటికీ మిగిలి పోతాయి నిత్యనూతనంగా....
ఎన్నో జ్ఞాపకాల అరల దొంతరల్లోని ఓ జ్ఞాపకం
ప్రతి క్షణం పలకరించే ఏదో ఒక జ్ఞాపకపు తలపు
మనలోని సంతోషానికో బాధకో నెలవు....
అలా మనతోనే ముడిపడిన, మనతోనే వున్న...
ప్రతి గతకాలపు జ్ఞాపకము....ఓ తీపి/చేదు గురుతు...
కొన్నాళ్ళకు కనుమరుగయ్యేవి జ్ఞాపకాలు కాదు....మనమే..!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

భలే రాస్తున్నారండి.చాలా బాగా చెప్పారు.
ఏమీ అనుకోకపోతే చిన్న సూచన
ఫొటో కుడివైపు పెడితే కవిత అంతా ఒక వైపు ఉండి బావుంటుంది అనిపిస్తోంది నాకు
మీరూ అలోచించండి

చెప్పాలంటే...... చెప్పారు...

సరే మీ మాట ఎందుకు కాదనాలి అలానే పెడతాను చూడండి లత గారు థాంక్యు నేను రాసినది మీకు నచ్చినందుకు

veera murthy (satya) చెప్పారు...

చాలా బాగా రాసారు...

కొనసాగింపుగా....

కమ్ముకున్న జ్ఞాపకాల
బరువెక్కిన భారాన్ని
విరహాల ఉప్పెనలో
కరిగిపోయే తీరాన్ని

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అంత బాగా రాయలేను కాని ఏదో ట్రై చేస్తాను కొద్దిగా అయినా బాగా రాద్దామని....థాంక్యు సత్య గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner