8, మార్చి 2011, మంగళవారం

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా......

మనసార చిత్రం నుంచి కృష్ణ చైతన్య ఎంతో బాగా పాడిన ఈ పాట శేఖర్ చంద్ర సంగీత సారధ్యం లో రవిబాబు దర్శక ప్రతిభకు తార్కాణం. నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట . మరి మీ అందరికి కుడా నచ్చుతుందనుకుంటున్నాను....మీ కోసం ఈ పాట.... వీడియో లింక్ కోసం చూసాను క్షమించాలి దొరక లేదు.....లింక్ దొరికింది స్వామీ గారికి థాంక్స్
ఇదిగో లింక్ మీ కోసం....
http://www.youtube.com/watch?v=GgkQPfJnQx0&feature=related
http://www.youtube.com/watch?v=hDJMhZ5TNW0

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా....
నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...

చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలా....
ఇంతందం ఇన్నాళ్ళ నుండి దాక్కుంటూ ఏ మూలనుంది
గుండెల్లోన గుచ్చేస్తోంది సూటిగా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచం గమ్మత్తుగుంది కొంచెం ఖంగారుగుంది
అంతా చిత్రంగ ఉంది ఈ రోజు ఏమైందిలా.... నువ్విలా....

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...
చంద్రుండ్ని మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో
ఎంతెంతో ముద్దొస్తోంది బొమ్మలా....
తారల్ని ఒళ్ళంత పూసి
మబ్బుల్తో స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవతా...
మొత్తం భుగోళమంతా పూలే చల్లేసినట్లు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే...
నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు
ఏంటో దోర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా.... నువ్విలా...

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...
గుండె లోపలా గువ్వల గుంపులా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా...నువ్విలా....
నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

ఇప్పుడే విన్నానండీ ఈ పాట,చాలా నచ్చింది నాకు కూడా
క్రిష్ణచైతన్య వాయిస్ చాలా బావుంటోంది.మంచి పాట వినిపించారు థాంక్యూ

చెప్పాలంటే...... చెప్పారు...

ఎక్కువ గా వీలైనప్పుడల్లా ఈ పాట వింటూ వుంటాను నేను....చాలా బావుంది కదూ ....థాంక్యు మీరు విన్నందుకు

జయ చెప్పారు...

పాట బాగుందండి. మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

పాట బాగుందండి. మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

sneha చెప్పారు...

నేనూ ఇప్పుడే విన్నాను అండి చాలా బాగుంది. మంచి పాటను పరిచయం చేసారు ధన్యవాదాలు

మిరియప్పొడి చెప్పారు...

The song was ok only.
I too like KC voice, but this song did not thrill me.
Is this a new movie? Who is the hero?

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు జయ, స్నేహా నైస్తమైన పాట మీకు కుడా నచ్చినందుకు

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి నాకు చాలా......నచ్చింది ఈ పాట. కొత్త సినిమానే, హీరో కుడా తొత్త వాడే సినిమా చాలా బావుంది....థాంక్యు కామెంట్ కి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 
కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner