10, ఏప్రిల్ 2012, మంగళవారం
కొంతమంది వైద్యులు....!!
వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు... పెద్దల మాటలు సద్ది మూటలు....కాని ఈనాటి వైద్యులలో ఆ తపన, భావన లేదు....వైద్యం చేస్తున్నాము అంటే చేస్తున్నాము... మనకు డబ్బులు వస్తున్నాయా లేదా అనే కాని రోగి మానసిక స్థితి గురించి ఏమి పట్టించుకోరు. కార్పోరేట్ స్కూల్స్, కాలేజ్ లానే ఆసుపత్రులు కూడా వెలిసాయి మన ఖర్మకి. దీనికి తోడు ఆరోగ్యమిత్రాలు, ఆరోగ్యశ్రీలు వచ్చి మరి అధ్వాన్నమై పోయింది...జరిగే మంచి కాస్త అయితే చెడు ఎక్కువ అయింది. రోగికి మనో ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగించాల్సిన వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం , విసుక్కోవడం చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. ప్రాణాలు పోసే దేవుళ్ళు అని మనం వెళ్తే మాటలతో, చేతలతో నరకం చూపించి నూరేళ్ళు బతికేవాళ్ళని కూడా అప్పటికప్పుడు చంపేస్తున్నారు. వైద్యం సరిగా చేయడం రాని వారు రోగులను మాటలతో కుళ్ళబొడుస్తూ న్నరకం చూపిస్తున్నారు. అన్ని తెలిసిన వాళ్ళకే ఇలా చేస్తుంటే ఏమితెలియని వారి సంగతి ఆ పరమాత్మకెరుక. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనది. మన నడవడి , మాట తీరు ఆ వృత్తికి వన్నె తేవాలి కాని మచ్చగా మారకూడదు. ఓర్పు సహనం లేనివారు దయచేసి ఆ వృత్తిలోనికి వెళ్ళకండి ....మీ దగ్గరకు వచ్చ్సిన రోగులను దయతో ఆదరించండి, మీ మాటలతో స్వాంతన కలిగించండి కాని చంపకండి. ఇది నా విన్నపం వైద్య వృత్తిలో వున్న అందరికి....
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఇది ఎక్కడ జరిగిందో,ఆ డాక్టర్ల పేర్లు చెప్పండి
ఏమి చేస్తారు చెప్పండి? ఒక విషపు చుక్క చాలు అంతా విషంగా మారి పోవడానికి.... మా వాల్లలోను చామంది డాక్టర్లే వున్నారు చాలా కొద్ది మందే ఇలా వుంటారు...జీవితపు విలువలు తెలియదు వాళ్లకు అంతే అండి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి