15, ఏప్రిల్ 2012, ఆదివారం

మీరు అవ్వండి....!!

తియ్యని మాటల మాటున దాగిన తీయదనం
సాగర మధనంలో జనించిన హాలాహలం
ఓ అబద్దం లో ఆనందం....!!
ఓ చేదు నిజం లో గరళం ...!!
చివరగా దొరికిన అమృతం కోసం
దేవ దానవుల పోరాటం..
ఈ నాటి సత్యాసత్యాల సయ్యాట...!!
ఆనాటి దైవ జూదం ఈ నాటి నాయకుల మేటి ఆట...
అది తెలియని మన బతుకులతో రాజకీయ విన్యాసం...!!
ఆ వైకుంఠపాళిలో గెలుపు ధననాయకులదే ఎప్పుడూ..!!
అధోగతి సామాన్యునిదే...!! మోయలేని భారం మనకు ....!!
దాయలేని ధన భాండాగారం వారి సొంతం...!!
అందుకే అవ్వండి అందరూ మేటి రాజకీయ నాయకులు....!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

ఎంతో కాలం ఉండదనిపిస్తుంది నాకు మన దేశానికి పట్టిన దుస్తితి. ఆశావాదినేమొ నేను మరి!బాగుంది మంజు గారు.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner