26, ఏప్రిల్ 2012, గురువారం

దూరం తెలియని గమ్యం..!!


దూరం దూరం తీరం తెలియని గమ్యం
పయనం పయనం అంతే లేని ప్రయాణం
భారం భారం మోయలేని బతుకు బండి బరువు
కోపం కోపం చేతకానితనంతో చిరాకుపరాకు
చేయలేక చేవలేక గెలుపంటే తెలియనితనం
ఎదుటివాడి....
ఓటమిలో మనల్ని వెదుక్కునే క్రమంలో
పతనానికి చిరునామా మనదే...!!
విజయానికి చేరువై గెలుపు పిలుపు
తలుపు తడుతుందేమోనని భయం..!!
చేతగాని తనాన్ని ఒప్పుకోలేక
రుసరుసలతో....విసవిసలతో...
అదే జీవితమనే భ్రమలో.....చక్రభ్రమణంలో...
పరిభ్రమించే చేతగాని వాళ్లకు
గెలుపు సింహాసనం జీవితంలో అందని ద్రాక్ష పుల్లనే...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుంది మంజు గారు.

జీవన పయనం - అనికేత్ చెప్పారు...

భలేరాసారు.

జ్యోతిర్మయి చెప్పారు...

చేతగాని తనాన్ని ఒప్పుకోలేక
రుసరుసలతో....విసవిసలతో...
అదే జీవితమనే భ్రమలో.....చక్రభ్రమణంలో...
పరిభ్రమించే చేతగాని వాళ్లకు
గెలుపు సింహాసనం జీవితంలో అందని ద్రాక్ష పుల్లనే...!!

చాలా బాగా వ్రాశారు..

చెప్పాలంటే...... చెప్పారు...

వెన్నెల, అనికేత్, జ్యోతి అందరికి నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner