14, డిసెంబర్ 2012, శుక్రవారం

జీవిత పుస్తకం...!!

నాకు నేనే ఒక అర్ధం కాని వింత పుస్తకాన్ని...!! అలాంటప్పుడు ఎదుటి వారు నాకెలా అర్ధం అవుతారు..??
నేను వాళ్ళకెలా తెలుస్తాను...!! తెలియాలని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది..!!
నాలోనూ ఆవేశం..కోపం..ద్వేషం..బాధ..సంతోషం....ఇలా అన్ని భావావేశాలు ఉన్నాయి. ముఖచిత్రం బావుందని పుస్తకం తెరిస్తే ముందుగా ముందు మాటల్లో సంక్షిప్తంగా కాస్త తెలుస్తుంది మనసు తెలిసిన వాళ్లకి...!! ముందు మాటల్లో గొప్పగానే పొగడ్తలుంటాయి కాక పొతే అన్నీ నిజాలు కాదేమో...!! అలా అనిపించడానికి కారణం మన గురించిన నిజాలు మనకి తెలుసు కదా..!!
ఎంత మంచి పుస్తకమైనా అందరికి నచ్చాలని లేదు....అలానే పొగడ్తలకు చోటున్నట్టే విమర్శలకు స్థానముంటుంది...!! పుస్తకంలో మొదలు పెట్టిన ప్రతి పేజి బావుండాలనే అందరికి నచ్చాలనే అనుకుంటాము...కాకపొతే దేవుడే అందరికి మంచివాడు కాదు కదా....ఇక మనమెంత...!!
కొన్ని పేజీలు ఖాళీగా వదిలేద్దామని అనుకుంటే కుప్పలు తెప్పలుగా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాల పుటలు దొంతర్లుగా వచ్చి చేరతాయి....మరి కొన్నేమో మనం ఎంత అందంగా నింపుదామన్నా అలా ఖాళీగానే ఉండి పోతాయి ఎప్పటికి...!!
పుస్తకంలో మొదటి చివరి పేజీలు అందరికి ఒక్కటే.....మధ్య పేజీలు ఎలా....అన్నది మన ఇష్టం....!!
ఎంతో అందంగా మొదలైన  పుస్తకం లోని మొదటి పేజి అలా అలా పేజీలు పెరుగుతున్న కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ....కలల్ని...ఆలోచనల్ని..కాలంతో పాటుగా మోసుకుంటూ...మర్చిపోలేని పేజీలను దాచుకుంటూ...అక్కరలేని పేజీలను వదిలేస్తూ...అలా పయనిస్తూ చివరికి చివరి పేజీలోకి వస్తే.....!!
ఏముంది కధ సుఖాంతం...!! 

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పుస్తకంలో మొదటి చివరి పేజీలు అందరికి ఒక్కటే.....మధ్య పేజీలు ఎలా....అన్నది మన ఇష్టం....

Good expression.

జలతారు వెన్నెల చెప్పారు...

Nice one manju gaaru

చెప్పాలంటే...... చెప్పారు...

-:) Thank u vennela & vanaja garu

భారతి చెప్పారు...

పుస్తకంలో మొదటి చివరి పేజీలు అందరికి ఒక్కటే.....మధ్య పేజీలు ఎలా....అన్నది మన ఇష్టం....!!
ఎంతో అందంగా మొదలైన పుస్తకం లోని మొదటి పేజి అలా అలా పేజీలు పెరుగుతున్న కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ....కలల్ని...ఆలోచనల్ని..కాలంతో పాటుగా మోసుకుంటూ...మర్చిపోలేని పేజీలను దాచుకుంటూ...అక్కరలేని పేజీలను వదిలేస్తూ...అలా పయనిస్తూ చివరికి చివరి పేజీలోకి వస్తే.....!!
ఏముంది కధ సుఖాంతం...!!
ఓ జీవిత గ్రంధాన్ని ఎంత చక్కగా అక్షరీకరించారో........
జోహర్లండి మంజుగారు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు భారతి గారు... చాలా సంతోషం మీకు నచ్చినందుకు....తెలుగు సినిమాలా చివరిలో శుభం పడితేనే అందరికి సంతోషం కదండీ అందరికి శుభం గా ఉండాలనే....!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner