అలా అని అన్ని ఒకేలా ఉండవు...ఒకప్పుడు పరిచయాలకు అనుబంధాలకు ఉత్తరాలే వారధిగా ఉండేవి....ఎంత దూరంలో ఉన్నా...ఆలోచనల్ని, ఆనందాన్ని...
ఇలా ఏ అనుభూతినైనా పంచుకోవడానికి
ఉత్తరాలే బావుండేవి...!!
ఇప్పట్లా ఫేస్ బుక్ లు...చాట్ లు లేకపోవటమే..అప్పట్లో....!!
ఉత్తరాల జ్ఞాపకాలు ఇప్పటికి...ఎప్పటికి మధురంగా బావుంటాయి...నాకైతే...!!
ఇప్పట్లో ఫేస్ బుక్ ఎకౌంట్ లో కాని మరే ఇతర చాట్ ఎకౌంట్ లో కాని ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటె అంత గొప్ప...మనకు తెలిసిన వాళ్ళే కానక్కరలేదు..ఎవరైనా పర్లేదు అని ఓ కే అంటే ...అన్ని బావుంటే పర్లేదు...కాని ఏ చిన్న తేడా వచ్చినా జీవితమే మారిపోయే అవకాశం ఎక్కువ..!!
ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఉన్న సమయాన్ని మనకోసం వాడుకోవాలనుకోవడం మాత్రం సరియైన పద్దతి కాదు..అలా కాకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా మన పరిధిలో మనం ఉంటే ఏ పరిచయమైనా పది కాలాలు ఉంటుంది....!! మన మూలం గా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది గుర్తు ఉంటె చాలు...!!
నాకేదో కష్టం ఉందని ఎదుటి వాళ్ళు జాలి చూపించాలి...సాయం చేయాలి...ఇలా ఏవేవో అనుకుని స్నేహం చేయడం తప్పు...కష్టం, సంతోషం పంచుకోవడం తప్పు కాదు...ఎదుటి వాళ్ళ జీవితంలోకి మనం చొరబడాలనుకోవడం తప్పు...!! వాళ్ళకంటూ ఉన్న సమయాన్ని వాళ్లకు వదిలేయండి....పలకరించినప్పుడు మాట్లాడండి...!! ఎప్పుడూ....మాట్లాడాలనుకోవద్దు..అది ఇద్దరికి మంచిది కాదు....ఆ స్నేహం ఎక్కువ కాలం నిలువదు...!!
ఉత్తరాల్లో ఉన్న నిజాయితీ ఇప్పటి స్నేహాల్లో ఉందని అనుకోవడం కూడా పొరబాటే....!!
చాలా తక్కువ స్నేహాలు ఏ కల్మషం లేనివి ఈ రోజుల్లో....!!
ఎనిమిది ఏళ్ళు ఒకరిని ఒకరు చూసుకోకుండా రాసుకున్న ఉత్తరాల స్నేహం
ఇప్పటికి అప్పటి పరిమళాలతో అలానే ఉంది....!!
మరి ఇప్పటి స్నేహాలు ఎన్నాళ్ళో...!!
7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంజు గారు,ఉత్తరాలలో వాళ్ల చేతివ్రాతతో చెప్పిన ఊసులు చాలా విలువైనవి.. ఇప్పటి స్నేహాల గురించి బాగా చెప్పారు..
చేతి రాత విలువ తెలిసిన వాళ్లకి స్నేహం విలువ కూడా బాగా తెలుస్తుంది చిన్ని గారు...ధన్యవాదాలు నా టపా నచ్చినందుకు....
మఖ లో పుట్టి పుబ్బ లో అంతమయ్యే స్నేహాల గురించి మాట్లాడటం ఎందుకు లెండి ! :)
కలం స్నేహం ఎంత బావుండేది. ఉత్తరాలు మన మనోభావాలకి ప్రతీకలు. ఇప్పటి తరంకి పేస్ బుక్ వాల్ చాలు.వందల మందికి ఒకే సందేశం.
ఈ పోస్ట్ బావుంది.
అవును వనజ గారు అలాంటి స్నేహాల గురించి ఎంత తక్కవ మాటలాడుకుంటే అంత మంచిది. -:) టపా నచ్చినందుకు ధన్యవాదాలు
ఈ రోజుల్లో కలం స్నేహం ఎక్కడ?
అంతా కులం స్నేహమే.
(అంతర్జాలంలో కూడ)
ఈ రోజుల్లో కలం స్నేహం ఎక్కడ?
అంతా కులం స్నేహమే.
------------
వావ్. Good One.
-:) అవునండి మీరు అన్నది కూడా నిజమే....థాంక్యు రావ్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి