11, డిసెంబర్ 2012, మంగళవారం

ఇదీ బావుంది....!!

చుట్టూ అందరున్నా నాకెవ్వరూ లేనట్టుగా
అన్ని బందాలున్నా ఏ బంధమూ నాది కానట్టుగా
నిస్పృహో....
నిట్టూర్పో..
నిస్సహాయతో...
ఏదో తెలియని...
నిశ్శబ్ద శూన్యం ..!!
ఒంటరితనంతో ఏకాంతమో....!!
ఏకాంతంతో సహవాసమో....!!
ఎలా ఉన్నా అన్నింటా నువ్వే...!!
వడి వడిగా పరుగులెత్తే  కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే.....
మెల్లగా తడిమి వదలి పోయింది....
నీ జ్ఞాపకాలతో నన్నుండమని....!!

15 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శోభ చెప్పారు...

"ఒంటరితనంతో ఏకాంతం.. ఏకాంతంతో సహవాసం.." వడివడిగా పరిగెత్తే కాలం నీ జ్ఞాపకాలతో నన్నుండమని తను వెళ్లిపోయింది... చక్కటి ఫీల్ మంజుగారు.. పదాల అల్లిక చాలా బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు థాంక్యు శోభ గారు చాలా సంతోషం మీ అభినందనకి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

superb..Kongrotta ardhaalato.. hryshyamgaa undi.

జలతారు వెన్నెల చెప్పారు...

Nice one manju gaaru

స్వామి ( కేశవ ) చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
స్వామి ( కేశవ ) చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
స్వామి ( కేశవ ) చెప్పారు...

బాగుందండి..

స్వామి ( కేశవ ) చెప్పారు...

మంజుగారు, ఏదో problem వచ్చింది. ఒక కామెంట్ చాలా సార్లు కనిపిస్తుంది.అందుకోసమే తీసేసాను ఏమీ అనుకోకండి.

చెప్పాలంటే...... చెప్పారు...

అయ్యో పర్లేదండి చాలా రోజుల తరువాత కనిపించాయి మీ కామెంట్లు...ధన్యవాదాలు కేశవ గారు..ఎలా ఉన్నారు..??
థాంక్యు వెన్నెలా
వనజ గారు చాలా సంతోషం

స్వామి ( కేశవ ) చెప్పారు...

బాగున్నానండి.
కాస్త పనిఎక్కువగా ఉండి ఇటుగాసంచరించడం కాస్తతగ్గించాను.. :)
మీరెలా ఉన్నారు?.. ఈమద్య చాలా మంచిపోస్ట్ లే వేసారు. మిస్ అయినట్టున్నాను. ఇప్పుడే చూస్తున్నాను.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు అండి...బావున్నాను .. చూసి చెప్పండి ఎలా రాశానో....!!

భారతి చెప్పారు...

వడి వడిగా పరుగులెత్తే కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే.....
మెల్లగా తడిమి వదలి పోయింది....
నీ జ్ఞాపకాలతో నన్నుండమని....!!

చక్కటి భావవ్యక్తీకరణ ........ చాలా చక్కగా చెప్పారు.

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు ధన్యవాదాలు భారతి గారు

శ్రీ చెప్పారు...

సింప్లీ సూపర్బ్ ఫీల్ మంజు గారూ!...చాలా బాగుంది...@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

-:) థాంక్యు శ్రీ గారు నచ్చినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner