ఎందుకండీ మరీ ఇంత దౌర్భాగ్యపు ఆలోచనలు చేస్తున్నాము....కనీసం కాస్తయినా మానవత్వం లేకుండా...!! నిన్న ఒక టపాకి కొన్నికామెంట్లు చూసాక రాయకుండా ఉండలేక పోతున్నాను...
చనిపోయిన నిర్భయ గురించి...జరిగిన దారుణం గురించి....!!
మనది......... భరతభూమి...ఖర్మభూమి...వేదభూమి..!!
ఎక్కడో వేరే దేశాల్లో వాళ్ళు అలా ఉంటున్నారు...ఇలా ఉంటున్నారు....మనం కూడా అలా ఉంటే తప్పేంటి...??
తప్పేం లేదు మంచిని ఎక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు...కాకపొతే తెలివి వెర్రి తలలు వేస్తున్న ఈ రోజుల్లో చెడుని మాత్రమే తీసుకుంటున్నాము...మంచిని వదిలేస్తున్నాము...!!
వర్ధమాన దేశాల్లో కూడా ఇష్టం లేకుండా ఏమి చేయరు....అలా చేస్తే అది చాలా పెద్ద నేరం..!! మేం చాలా ముందు ఆలోచనలు చేస్తున్నాము...మిగిలిన అందరు వెనుకబడిన వారు...మా అంత దూరపు ఆలోచనలు చేయలేరు...మేము చాలా విశాల....హృదయులము అని అనుకునే మీకు పాపం ఈ విష్యం తెలియదా...!!
ఏం అబ్బాయిలు సహజీవనం...చెత్తా..చెదారం అంటూ వాళ్లకి ఇష్టం వచ్చినట్లు ఉండటం లేదా.!! జరిగిన దారుణం గురించి మాట్లాడకుండా ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళితే తప్పు లేదు....వాళ్ళు రేప్ చేస్తే తప్పేంటి...??
డేటింగ్ చేసే వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అన్నట్లుగా ఉంది...!! ఎవరి అబిప్రాయాలు వాళ్లకి ఉంటాయి... కాని...మన ఇష్టాన్ని...అభిప్రాయాల్ని ఎదుటివారి మీద రుద్దడం ఎంత వరకు సమంజసం...ఒక్కసారి ఆలోచించండి...!!
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు...అమ్మాయి తనకి నచ్చిన పని చేస్తే తప్పు...అదే అబ్బాయి ఏం చేసినా పర్లేదు....ఇదేం న్యాయమండి...??
మనం జనారణ్యం లోనే ఉన్నామని మరొక్క సారి ఋజువైంది...జనారణ్యం మాత్రమే కాదు రాక్షస నీతిని సమర్ధించే జనరాక్షసుల మద్యలో ఉన్నామని నిరూపిస్తున్నారు....!!
జరుగుతున్న దారుణాలకి స్పందించక పోయినా పర్లేదు కాని...కాస్తయినా మానవత్వంతో ఆలోచించండి...!! లేదంటారా....కూర్చోండి..అంతే కాని మీరు మనుష్యులని మరచి పోకండి....!!