29, జనవరి 2013, మంగళవారం

ఎందుకో మరి...!!

ఒంటరితనంతో ఏకాంతంలో
నీ ఆలోచనలతో సహవాసం...!!
ఊపిరి పీల్చలేని వత్తిటిడిలోనూ
నీ ఊహల తోనే స్నేహం...!!
అందరితో ఉన్నా...
నీతో మాత్రమే ఉన్న అనుభూతి...!!
ఎందుకో మరి...!!
అనుక్షణం నా తలపులు
నీ చుట్టూనే పరిభ్రమణం...!!
నువ్వు కాదన్నా...
నీతోనే నిరంతరం...!!
నే వద్దన్నా నను వదలని
నీ తలపుల పరిమళాలు
గుభాళిస్తూనే...ఉన్నాయి..!!
ఆ మత్తులో నను ముంచేస్తున్నాయి...!!
అలా ఉన్నా బావుంది....నీతోనే ఉన్నట్టుగా...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శోభ చెప్పారు...

"అలా ఉన్నా బావుంది....నీతోనే ఉన్నట్టుగా...!!".......... :) హాయిగా ఉంది మీ ప్రేమలా... మంజుగారు..

చెప్పాలంటే...... చెప్పారు...

:) థాంక్యు శోభ గారు

అక్షర సమరం చెప్పారు...

Baagundandi,

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Rohini garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner