నీ చుట్టూ తిరిగే నా ఆలోచనల్లా...!!
దరి అంతే లేని సంద్రం....
నీ మనసు నాకు తెలియనట్లే..!!
సముద్రాన్ని తాకే ఆకాశం దూరంగా...
చూడటానికి బావుంటుంది నీలాగా...!!
నింగి నేలా కలవలేవు....కలుసుకోవాలని ఉన్నా...
సంద్రాన్ని తాకలేని ఆకాశం...
ఎప్పటికి అలానే ఉంటుంది తాకినట్లుగా....!!
నా ఆలోచనలు నీ చుట్టూ తిరగక మానవు....
నే జీవించి ఉన్నంత వరకు..!!
ఈ జన్మకు తెలియదు నీ మనసు....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
సింపుల్ గా బాగుంది..మంజు గారూ!...@శ్రీ
థాంక్యు శ్రీ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి