ఏవిటోనండి ఒక్కోసారి చిన్న విష్యమే పెద్దదిగా చేసుకుని అందరిని దూరం చేసుకుంటూ ఉంటాము....పిలవక పొతే ఎందుకు పిలవలేదు....?? పిలిస్తే అదిగో వాళ్ళని బాగా ఆప్యాయంగా పిలిచారు...నన్ను ఏదో పిలవాలని పిలిచారు....ఇలా ప్రతిదానికి వెదుకుతూ పొతే ఒక్కటి కూడా నిజాయితీగా అనిపించదు...తప్పులు వెదకడమే మన ధ్యేయమైతే....!! సరిపెట్టుకుంటే అన్ని బానే అనిపిస్తాయి....గొడవ పెట్టుకోవాలి అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి....ఏదో సామెత చెప్పినట్లు ఇష్టం లేకపోతె అమ్మ అని పిలిచినా కూడా నీయమ్మ లా అనిపిస్తుంది....!!
ఉన్న ఈ నాలుగు రోజులు మనం అందరితో బావుంటే మనతో అందరూ బావుంటారు...కోపం రాదనీ రావద్దని చెప్పడం లేదు...కోపం రాక పొతే మనం మనుష్యులమే కాదు...మహర్షులు దేవుడే కోపానికి బానిసలు...ఇక మనమెంత చెప్పండి....!!
సాద్యమైనంత వరకు మనం అందరితో బావుంటే వాళ్ళు బావుంటారు.....చిన్న చిన్న కోపాలు అలుకలు లేక పొతేనేమో జీవితం చప్పగాను ఉంటుంది....అందుకే మనం బావుండాలి...అందరూ బావుండాలి...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఇలా మనం అనుకుంటామా.. మరి అందరూ అలా అనుకోవద్దూ..!
అందుకో ఏదో పై పైకి అనుకుంటే చాలు లోపల ఏమి అనుకున్నది తెలియదు కదా! :)
అవును కదా వనజ గారు అందరూ అనుకుంటే బావుండు.....-:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి