మతాల మారణహొమాలు....??
కులం కూడు బెట్టునా...??
మతం మరణమాపునా....??
ఎందుకీ వర్గ పోరాటాలు...??
కుల మత విభేదాలు....??
మానవత్వం కోసమా....??
సమానత్వం కోసమా....??
నేను గొప్ప...!!
నా సామాజిక వర్గం గొప్పంటూ...
మాటలు కోటలు దాటిస్తూ
ఒళ్ళు విరుచుకు తిరిగే వారే కాని....
మానవత్వం చిరునామా తెలియని వారే ఎక్కువ....!!
ఇక సమానత్వమెక్కడ....?? సమతెక్కడ...??
వసుదైక కుటుంబానికర్ధాలు మార్చి
రాజకీయపు రాక్షస క్రీడలు
విషపు కోరలు చాస్తూ ఉంటే....
హాలాహలాన్నే అమృతమని నమ్ముతూ
కుల మతాల కుమ్ములాటల్లో
అశువులు బాస్తున్న అమాయకులెందరో....!!
వద్దు వద్దు వర్గ వర్న విభేదాలు
విభజన పోరాటాలు...
ఎన్నో సంసృతుల కలబోత....
సమతల మమతల నెలవైన భరతావని
సర్వమత సమ్మేళనం...!!
సకల జనుల సన్నిహితం...!!
అందరిది ఒకటే మతం ఒకటే జాతి
అదే అదే మానవత్వం....!!
అదే అదే భరతజాతి....!!
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
తర తరాలుగా కులం పేరుని అడ్డుపెట్టుకుని చదువులు, వుద్యోగాలు, పదవులు, ప్రమోషన్లు అనుభవిస్తున్న వాళ్ళ సంగతి ఏవిటి... వాళ్ళని కూడా కులాన్ని మర్చిపోమంటారా ఏమిటి కొంపతీసి..
raajakeeyam srushtinchani vibhedam ledu adi mana duradrushtam prsthutha paristhithini mee kavithalo baagaa choopagaligaaru chaalaa baagundi
మీ బ్లాగుతో బ్లాగ్ వరల్డ్ లో మెంబర్ గా జాయినవ్వండి.మీ బ్లాగ్ విజిటర్స్ ను పెంచుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
http://ac-blogworld.blogspot.in/p/blog-page.html
నిజమే ,ఇదీ మన సంస్కృతి అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాము మనం .
ధన్యవాదాలు రమేష గారు,వోలేటి గారు, శర్మ గారు
మీరన్నట్టు రాజయోగం అనుభవించే వాళ్ళు వదులుకోలేరు కదా అండి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి