20, జూన్ 2013, గురువారం

ఎంత వరకు సమంజసం...!!

 స్నేహాన్ని స్నేహంగానే ఉండనివ్వండి..నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.కొన్ని సార్లు మనం చేసే ఉద్యోగం వల్లనో లేదా ఏదైనా పని వల్లనో అందరితో కలిసి పోవాల్సి వస్తుంది. ఎంత మందితో కలిసి పని చేసినా కొందరే మనకు దగ్గరగా రాగలుగుతారు. అన్ని స్నేహాలు మనసుకు మనిషికి దగ్గరగా రాలేవు. అలా అని ప్రతి పరిచయం స్నేహం కాలేదు....ఎవరికీ ఇబ్బంది లేని పరిచయాలు స్నేహాలు ఎక్కువ రోజులు నిలబడతాయి. అప్పట్లో కలం స్నేహాలు ఉండేవి...ఇప్పుడు ముఖ పుస్తక స్నేహాలు బాగా ప్రాచుర్యం అవుతున్నాయి...ఒక్కోసారి కాస్త ఇబ్బంది పెడుతూ కూడా ఉంటాయి...కాదంటారా....!!
ఎవరికీ వారు...మనని ఎవరు అర్ధం చేసుకోవడం లేదు మంచి స్నేహితులు కావాలి పంచుకోవడానికి అనుకుంటూ వెదుకుతూనే ఉంటారు. దగ్గరలోనే ఉన్న మన ఇంట్లో వారిని గుర్తించలేరు. బయట వారితో ఉన్నంత స్నేహాన్ని, అభిమానాన్ని మన అనుకున్న ఇంటిలోని వారితో ఎంత మంది పంచుకోగలుగుతున్నారు...?? అదేమని అంటే ఇంట్లో వారు అర్ధం చేసుకోరు అని చెప్తారు....అందరూ ఇలానే ఉంటారని కాదు ఖచ్చితంగా కొందరుంటారు...!! మనం ఇవ్వలేనప్పుడు ఎదుటివారి నుంచి ఆశించడం ఎంత వరకు సమంజసం...!!
 మనకి  మనం అనుకుంటాము  " నేను అందరితో బానే ఉంటున్నాను కాని నాతోనే సరిగా ఉండటం లేదు" అని...ఇది ఎంత వరకు నిజం....?? మనం ఎలా ఉంటున్నామో అని మనలా కాకుండా ఒక క్షణం మనతోనే వేరే మనిషిలా ఆలోచిస్తే మన గురించి మనకు తెలుస్తుంది...!! ఎదుటి వారిలో తప్పులు మాత్రమే వెదకడం మాని మంచిని చూడగలిగితే అంతా మంచే కనిపిస్తుంది....మనం చూసే కళ్ళలోనే మంచి చెడు ఉంటుంది....అదే అండి మన ఆలోచనలోనే అంతా ఉంటుంది....చాలా వరకు...!! కాకపొతే కొన్నిట్లో మాత్రం ఊహకందదు....!! అదేనేమో విధి వి చిత్రం అంటే....!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

ఎవరి వీపు వారికి కనపడనట్లు , ఎవరి తప్పు ( లోపాలు ) వారికి కనపడదు . ఎదుటివారి వీపు మనకు కనపడ్తుంది కనుక , ఎదుటివారి తప్పులు మనకు స్పష్టంగా కనపడ్తాయి . అమ్దుకేనేమో ఎవరి తప్పులు , లోపాలు వారు చూసుకోకుండా ఎదుటివారి తప్పుల , లోపాల గురించి విమర్శిస్తూ వుంటారు . ఇది సర్వ సహజం అయిపోయింది .
మన వీపిఉ మనకు కనపడకపోయినా , మనమ్ ఎలా శుభ్రపరచుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటామో , అలాగే మన తప్పులని , లోపాలని ఎదుటివారి ద్వారా ( సహకారంతో ) తెలుసుకొని సరిదిద్దుకో ప్రయత్నిస్తె , కొంతలో కొన్ని అయినా దూరమవుతాయి .
మీరన్నట్లు కొంచెం ఆలోచిస్తే మార్గం లభ్యమవుతుంది .

PNG Financial Advisor చెప్పారు...

ఈ వీపుల కద బగుంది.............

అజ్ఞాత చెప్పారు...

మన రక్త సంబధీకులతో మనం ప్రేమగా, స్నేహంగానే ఉంటాము ఒక వయసు వచ్చేవరకు. ప్రేమలో ఏ మార్పూ ఉండదు. కానీ పెరిగి పెద్ద అవుతూన్నకొద్దీ వారివారి వ్యక్తిత్వాలు మారి, తమకంటూ ఒక స్థిరమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుంటారు. ఒకే తల్లి బిడ్డలైనా అందరి ఆలోచనలూ ఒకేలా ఉండవు. అటువంటప్పుదు తమ అలోచనా విధానానికి దగ్గరగా ఉన్నవారితో స్నేహం చేయడం సహజమైన పరిణామం. అలాగని ఇంట్లోని వారితో అనుభందం లేదని కాదు. సున్నితమైన తేడా ఉంది.

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుంది అంజు గారు టపా. మనం లోకాన్ని చూసే దృష్టి సరి అయినది అయితే అంతా బాగుంటుంది. మనలో దృష్టి లోపం పెట్టుకుని ఇతరులను నిందించటం సరి అయిన పద్దతి కాదు.Be positive, take it easy and never take anything to heart...

చెప్పాలంటే...... చెప్పారు...

అను గారు మీరు చెప్పింది నిజమే కాక పొతే బంధాలలో సున్నితత్వం దెబ్బతింటోంది అంతే..మీ స్పందనకు సంతోషం అండి
ధన్యవాదాలు శర్మ గారు చక్కని వివరణ తో చెప్పారు
నవీన్ గారు మీరు చెప్పింది నిజమే :)
వెన్నెల గారు మనం పాజిటివ్ గా వున్నా ఎదుటి వారు ఉండొద్దా....!! అదే కదా నా....-:) మనసు కి దగ్గర గా తీసుకోవద్దు అనుకుంటూనే కొన్ని అలా లోపలి వెళిపోతూ ఉంటాయి ఏం చేయలేము లెండి.. మీ అభిమానానికి ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner