వినిపించే మధుర రాగాలు ఎన్నో....!!
వినగలిగే మనసుంటే
మరిపించే మురిపించే మౌన గానాలెన్నో...!!
తీయని ఆ గొంతు సడిలో
సవ్వడి చేస్తూ సందడి చేసే స్వరాలెన్నొ...!!
మరో రంగుల లోకంలో
సప్త వర్ణాల సుస్వర కలయికలెన్నో....!!
వినగలిగే మనసుంటే చాలు
మనసుతో చూడటానికి కనులెందుకు...!!
( చక్కని స్వరాలతో సుస్వర రాగాలతో అలరిస్తున్న బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ పిల్లలకి నా అభినందనలు ఈ కవిత అలా పాడే ప్రతి ఒక్కరికి అంకితం....ప్రోగ్రాం బావుంది కాని పేరు మాత్రం బాధని కలిగిస్తోంది...మనసు కలుక్కుమంటోంది....ఈ టి వి వారు ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది..)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
బావుందండీ కవిత . టపా మీద టపా .ఇంట్లో ఎవరూ లేరాండీ?"బ్లాక్"కొన్ని నిజాలు బాధాకరంగానే ఉంటాయి . కానీ ఒప్పుకోక తప్పదు .
ఎందుకు లేరు అందరు వున్నారు మా పిల్లలు చాలు వందమంది పెట్టు ఏదో కాస్త సమయం దొరికింది అంతే అండి... సంతోషం మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి