నీ ఒంటరితనానికి నే నేస్తానయ్యానా
నీ మౌనానికి నే సంకేతానయ్యానా
నీ కలలకు వాస్తవ రూపానిచ్చానా
నీ భావాలకు అందమైన భాషనయ్యానా
నీ చిత్రాలకు సరిపోల్చే ఆకారానయ్యానా
నీ మనసుకు దగ్గరగా తోడుగా ఉన్నానా
నీ జ్ఞాపకాలను నాతోనే ఉంచుకున్నానా
నీ ఆత్మీయతను పంచుకున్నానా
నీ చెలిమికి దాసొహమయ్యానా
నీ అక్షరాలకు ఆలంబనగా మారానా
నీ కనులలో కాపురం ఉన్నానా
నీ వాస్తవం నేనుగా అయ్యాను ఆన్ని కలసి....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
బాగుంది . కాకుంటే చివరలో కొంచెం క్రమం మారిస్తే ఇంకా బాగుండేది .
నీ కనులలో కాపురం ఉన్నానా
నీ అక్షరాలకు ఆలంబనగా మారానా
నీ వాస్తవం నేనుగా అయ్యాను ఆన్ని కలసి....!!
ఏమో అండి అలా అనిపించి రాశాను ఈ సారి ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తాను అండి శర్మ గారు ...ధన్యవాదాలు మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి