4, జులై 2014, శుక్రవారం

ఈ జన్మకు తెలుసుకోలేని....!!

సాహిత్యం రాహిత్యం నుండి వచ్చినా
సాన్నిహిత్యంలో నుంచి జనియించినా
ఏదైనా ప్రేమలోని నమ్మకానికి దాసోహమే
ఆ నమ్మిన క్షణానికే ఈ భావాల రాపిడి
సహజత్వమో అసహజత్వమో తెలియకుండా
ఇప్పటికి అలానే ఉండి పోయిన గతాన్ని
మార్చలేని మార్పులేని మనసుల
సంఘర్షణ ఘర్షణగా మారినా...
మారని మనిద్దరి ఆంతర్యాల గమ్యం
నాకు తెలియని నీకు తెలిసిన నేను
అందుకేనేమో నాతో ఆటలాడుతూ నువ్వు
ఎప్పుడూ ఓడిపోతూ నేను...
అయినా చిరునవ్వుని వీడని నా మోము
నేను ఓడినా అది నా గెలుపే అని సంబరపడుతూనే
ఓ జీవిత కాలం ఓడిపోయానని గుర్తించలేని
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని
పక పకా నవ్వుతూ నీ గెలుపు కోసం
నా ఆరాటాన్ని ఈ జన్మకు తెలుసుకోలేని
నీది ఎంత తెలివి అనుకోవాలో మరి...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

బ్లాగ్ వేదికతో ఉన్న మీ అనుబంధానికి మేము చాలా సంతోషిస్తున్నాము.మీ బ్లాగులో బ్లాగ్ వేదిక లోగో ధరించి మద్దతు పలకవల్సిందిగా కోరుచున్నాము.
ఇట్లు-బ్లాగ్ వేదిక టీం.

http://blogvedika.blogspot.in/

లంకె వేయుటకు:http://blogsvedika.blogspot.in/p/blog-page.html

vemulachandra చెప్పారు...

మార్చలేని మార్పురాని మనసుల .... మారని మనిద్దరి ఆంతర్యాల గమ్యం
నాకు తెలియని నీకు తెలిసిన నేను అందుకేనేమో నాతో ఆటలాడుతూ నువ్వు
ఎప్పుడూ ఓడిపోతూ నేను .... అయినా చిరునవ్వుని వీడని నా మోము
చాలా చక్కగా విడమర్చుతూ మనోభావన .... కవితా రూపం లో
అభినందనలు మంజు గారు!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner