వార వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం పూర్వాపరాలు చాలా వరకు తెలుసుకున్నాము... తెలుగు సాహిత్యంలో ఒకటైన విప్లవ సాహిత్యం గురించి ఈ వారం చూద్దాం...
ఈ విప్లవ సాహిత్యంలో భావావేశంతో పాటుగా జనాన్ని చైతన్య పరిచే గుణం కూడా ఉంటుంది... విప్లవ సాహిత్యంలో కూడా కథలు, కవితలు, కధానికలు, వచనం, నవల, సిని సాహిత్యం ఇలా అన్ని కోణాలు ఉంటాయి.... మనసులో నుంచి పుట్టేది భావావేశం... జరుగుతున్న సమస్యలకు మనసు స్పందిస్తే పుట్టేది విప్లవం... సమాజానికి తప్పును వేలెత్తి చూపేది విప్లవ... సమస్యలో మరో కోణాన్ని చూపిస్తూ మనిషిని తద్వారా సమాజాన్ని చైతన్య పరిచేది విప్లవసాహిత్యం... అక్షరాన్ని ఆయుధంగా మలిచి పోరాటాన్ని సాగించిన ఎందఱో నాయకులు, అమర వీరులు ఈనాడు మన మనస్సులో నిలిచిపోయారంటే అతిశయోక్తి ఏమి లేదు...
ఉద్యమమ నుంచి, సాజాజిక జన జీవనం నుంచి, సమస్యల నుంచి ఉద్భవించేదే విప్లవ సాహిత్యం ... ఇది జనానికి దగ్గరగా వచ్చినంతగా ఇతర సాహిత్యాలు ఈ కాలంలో రాలేదనే చెప్పాలి... మన అందరికి తెలిసిన మహా కవి శ్రీ శ్రీ మహా ప్రస్థానం ఇప్పటికి ఎందరి హృదయాల్లో సజీవంగా నిలిచి పోయిందో మనకు తెలుసు... సినీ పాటల రచనలో కూడా తనదైన శైలిని సృష్టించారు శ్రీ శ్రీ...సమాజంలో నలుగుతున్న సమస్యలతో ఎన్నో విప్లవ సినిమాలు వచ్చాయి ...దొరల ఆధిపత్యానికి అడ్డం పట్టిన చిత్రాలు, ఉద్యమాల నేపద్యాలలో వఛ్చిన చిత్రాలు అనేకం... విప్లవ రచయితలూ కాళోజి గారు, వరవరరావు గారు విరసం స్థాపనలో ముఖ్యులు... మన అందరికి సుపరిచితులు గద్దర్ గారు ఎంత గొప్ప విప్లవ కవో ఆయన పాటల గొంతు వింటే తెలిసిపోతుంది... విప్లవ సాహిత్యం, జానపద సాహిత్యం జనాల్లో చొచ్చుకు పోయినంతగా ఇతర సాహిత్య ప్రక్రియలు చుచ్చుకు పోలేదనే చెప్పవచ్చు...
అక్షరానికి ఉన్న శక్తి అపారం. అధికారిక శాసనాన్ని స్థిరపరిచినా, ‘అనధికార
శాసనకర్త’గా వ్యవహరించినా సాహిత్యం పోషించిన పాత్ర పదునైనది. ‘సాధారణ
మాటలకు ఇంత అసాధారణ సౌందర్యం, అలౌకిక ఆకర్షణ ఎలా వచ్చాయి.. అని పంక్తుల
మధ్యలోకి ఆశ్యర్యంగా చూస్తూ ఉండిపోయేవాడి’నని తన తొలి పఠనానుభవాన్ని
గురించి గోర్కీ రాసుకున్నాడు. అందుకేనేమో సాహిత్యం వెంట గుర్తింపు, కీర్తి
వస్తాయి. సమాజంలో సాహిత్యకారులకు ఎంతో కొంత గౌరవం లభిస్తుంది. కళాసాహిత్య
పోషకులైన రాజులను చరిత్ర కూడా తగు రీతిలో గుర్తుపెట్టుకుంది. కళాసాహిత్యాల
అసలైన సృష్టికర్తలు మాత్రం చరిత్ర ఎరుకలో ఉండరు...
సాహిత్యం దేని కోసం? దాని పరమార్థమేమిటి?’ వంటి ప్రశ్నలు బహుశా మన సమాజంలో
ఇప్పుడు కొత్తగా వేసుకోనక్కర్లేదు. రాజాస్థానాల నుండి, అధికార పీఠాల నుండి
స్వేచ్ఛ పొందిన సాహిత్యం, మందిలో కలిసిన సాహిత్యం, తలెత్తుకు నిలబడి
ధిక్కార పతాకను ఎగరేసిన సాహిత్యం సమాజానికి ఒక భరోసానిచ్చింది. తెలుగు
సాహిత్యకారులు ఆ వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించారు. అక్షరం ఆధిపత్యానిది
కాదు, అశేష ప్రజాసమూహాలకు ప్రాతినిథ్యం వహించేదనే దశకు చేరుకోవడంలో ఎంత
సంఘర్షణ ఉందో నేటికీ నడుస్తున్న చరిత్రే. సాహిత్యాన్ని సాహిత్యంగానే
చూడాలంటే, రాజకీయం కాని వ్యక్తీకరణ ఏదీ ఉండదని కుండ బద్దలు కొట్టి చెప్పాయి
మన సాహిత్యోద్యమాలు. ఎన్ని వాదాలున్నా తెలుగు సాహిత్యం పీడిత సమూహాల
పక్షాన నిలిచింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోని సకల దుర్మార్గాలను
ప్రశ్నించింది. సామ్రాజ్యవాద మార్కెట్ చేతిలో పరాయీకరణకు గురవుతున్న
మనిషిని గురించి దు:ఖించింది. తెలంగాణ నుండి పాలస్తీనా దాకా ఆధిపత్యాన్ని,
హింసను, అణచివేతను ప్రశ్నించింది. అట్టడుగుకు నెట్టివేయబడ్డ సమాజాల
సాంస్కృతిక వ్యక్తీకరణకు అక్షరరూపమిచ్చింది.
సాహిత్యకారులు అంతకన్నా ఇంకా ముందుకే నడిచారు. ఎన్నో సార్లు నేరుగా ఉద్యమ గొంతుక వినిపించారు.
విద్యార్థి,
మేధోరంగాన్ని ప్రభావితం చేశారు. ప్రగతిశీల భావాలకు వాహికలయ్యారు.
ప్రగతిశీల రచయితలు అని వేరుగా కాక రచయితంటేనే ప్రగతిశీలవాది అనే భావన
తెలుగు సాహితీలోకంలో స్థిరపడిరది. భాషా సాహిత్యాలను పాలకవర్గం చేతుల నుండి
తప్పించి ప్రజా ఉద్యమాలు తమ సొంతం చేసుకున్నాయి. ఎన్నో వేదికలు, భిన్న
ప్రాపంచిక దృక్పథాలు, భావ సంఘర్షణలు మామూలే. ఎన్నివైపుల నుండి వ్యవస్థతో,
రాజ్యంతో ఘర్షణ పడితే సామాజిక పురోగతికి అంత ప్రయోజనం. పురోగామి శక్తులను,
భావజాలాలను అయితే అణచివేయడం, లేదా వారి చేతుల్లోకి తీసుకోవడం చేయడం పాలకవర్గాలు నిరంతరం చేసే
పని. మొదటిది సూటిగా ఉంటుంది. రెండోది అనేక ముసుగులు వేసుకొని ఉంటుంది....
అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని అక్షరానికి అందించేదే విప్లవ సాహిత్యం... పదునైన భావాలను శరాలుగా సంధించడానికి... నిరాయుధమైన అక్షరమే వేల శరాలుగా మారి చేతనాన్ని కలిగిస్తుంది.. చెఇతన్యాన్ని రగిలిస్తుంది... అది విప్లవానికున్న శక్తి.... వేల ఉద్యమకారుల గొంతుల్లో భువనం బద్దలయ్యేలా వినిపించే ఒకే ఒక శక్తి... ఆయుధం విప్లవం... కనిపించని ఎర్రదనాన్ని అక్షరంలో కనిపింప చేసేదే విప్లవ సాహిత్యం....
ఇప్పటికే విప్లవ సాహిత్యం గురించి చాలా చెప్పేసుకున్నాం... మిగిలిన ముచ్చట్లు మళ్ళి వారం....
ఈ ముచ్చట్లు అరుణతార సంపాదకీయ సౌజన్యంతో.....
వచ్చే వారం మరికొన్ని సాహితీ ముచ్చట్లతో .....