21, ఫిబ్రవరి 2017, మంగళవారం

వెలితి పడుతున్న బంధం...!!

వెలితి పడుతున్న బంధం
వెతలు పడుతు వెక్కి పడుతోంది
ఆత్మీయతా రాగాన్ని ఆలపిస్తున్నా
కరువౌతున్న మమకారాన్ని తలపోస్తూ
జ్ఞాపకాల నీలి నీడల్లో తడుముతున్న
సౌకుమార్యాన్ని కాలరాస్తున్న
మృగతృష్ణకు పరాకాష్ఠగా మిగిలిన
పరిణయానికి ప్రత్యామ్నాయాలను
అడ్డుకోవాలన్న ఆత్రాన్ని
అణగద్రొక్కుతున్న మానవత్వాన్ని
మనసులేని మానవ పిశాచాలకు
అంకితమిచ్చినందుకు సిగ్గుపడుతూ
కళ్ళెదుట నిలిచిన విచ్చలవిడితనాన్ని
సహించలేని నిజాల గొంతును
నులమాలన్న దురహంకారం
రంకెలు వేస్తుంటే
పట్టపగలే నాలుగు గోడల నడుమ
వలువలు విడిచిన విలువలు
వరద గోదారై పారుతుంటే
సభ్య సమాజం చూస్తుండగానే
న్యాయం గొంతు నొక్కుతున్న
అధములు నడయాడుతున్న సెలవులను
భారంగా మోస్తూ ఎదురుచూస్తోంది
ఆది అంతాలకు ఆద్యమైన
అమ్మదనాన్ని, ఆడతనాన్ని
ఎరగా వేసి సృష్టి ధర్మాన్ని
నవ్వులపాలు చేస్తున్న నీచ జాతిని
నిరోధించే ఆయుధం  కోసం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner