3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఓదార్పు ఎక్కడ...!!

చీకటి చట్రానికి చిక్కిన
వెలుగుపూలు అక్కడక్కడా
మిణుక్కుమంటూ
అణగారిన ఆశలను తట్టి లేపుతూ
గుట్టలు గుట్టలుగా చేరిన
బాదరబందీల బందిఖానాలో
జమ చేసిన గతపు ఘట్టాలలో
అక్కడక్కడా తచ్చాడే
జ్ఞాపకాలు వెన్నాడుతూ
ఓటమి అంచులను తాకిన
బతుకు పుస్తకానికి ఓదార్పునిస్తూ
పతనమై పోతున్న విలువలు 
పరకాయ ప్రవేశంలో పరిణితిని
సాధిస్తున్న మానవ సంబంధాల
వెంపర్లాటల వాస్తవ కథనాల
పరిధుల నిర్వచనాల దృక్పధాలు
మార్చడానికి ప్రయాస పడుతూ
అనుబంధాల కోసం పాకులాడుతూ
సాగుతున్న ఎన్నో ఒంటరి అడుగులకు
ఓదార్పు ఎక్కడ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

garimellagamanalu చెప్పారు...

nice undi

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner