9, ఫిబ్రవరి 2017, గురువారం

ఏక్ తారలు....!!

1. కలలలో నేనుండి పోయా ...కాలం నీతో వెళ్ళిందని తెలియక...!!
2. అనురాగానికి అర్ధం నీవని తెలిసిందేమో .... మమకారంతో అల్లుకున్నాయి అక్షరాలు...!!
3. వెలుగురేఖల ఆనవాళ్ళు ... అలుపెరుగని ఈ అక్షరాలు...!!
4. కలలలో నేనుండి పోయా ...కాలం నీతో వెళ్ళిందని తెలియక...!! 
5. అక్షరానికి ఆయువు పోసింది ..అవ్యాజమైన నీ ప్రేమ ...!! 
6. మరణానికి సైతం భయమే ...పడతి పట్టుదల అంటే ..!!
7. నిన్ను మరిచే క్షణాలే లేవు నా దగ్గర_కన్నీటికి తావెక్కడ...!!
8. ముక్కల్లో లెక్కలే తేలడం లేదు_ఎద నిండా నీ రూపమే నిండి...!!
9. హరివిల్లు తోడైంది_మన చెలిమి జలతారు పరదాకు...!!
10. రాలిన క్షణాలన్నీ పదిలం_స్నేహ పరిమళాలు నిత్య నూతనమై విలసిల్లుతూ...!!
  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner